NTV Telugu Site icon

Nokia Super Fan: 3615 నోకియా మొబైల్స్ కలెక్షన్‭తో రికార్డ్ సాధించిన వ్యక్తి..

Nokia

Nokia

Nokia Super Fan: పొరపాటున ఇది మొబైల్ ఫోన్ స్టోర్ లోపలి భాగం అనుకునేరు.. కానే కాదు. ఇది స్పానిష్ నోకియా సూపర్ ఫ్యాన్ వెన్సెస్ పలావ్ ఫెర్నాండెజ్ ఇల్లు. అతను అధికారికంగా తన వద్ద 3,615 ప్రత్యేకమైన మోడళ్లతో అతిపెద్ద మొబైల్ ఫోన్‌ కలెక్షన్ లను కలిగి ఉన్నాడు. బార్సిలోనాలోని అతని ఇంటిలో ఉంచబడిన ఈ సేకరణ 2023లో ఆండ్రీ బిల్బీ అర్జెంటీస్ (రొమేనియా) నెలకొల్పిన 3,456 రికార్డును అధిగమించింది. 1999 క్రిస్మస్ సందర్భంగా అతనికి గ్రే నోకియా 3210 బహుమతిగా ఇవ్వడంతో అతని ప్రయాణం ప్రారంభమైంది.
AAY : సూపర్ హిట్ దర్శకుడికి చేదు అనుభవం.. లేవు పొమ్మన్నారు..

అతను 2008లో నోకియా ఫోన్స్ ను సేకరించడం ప్రారంభించాడు. ఆ సమయంలో అతను గతంలో కొనుగోలు చేయలేని అన్ని మోడళ్లను కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. అతని సేకరణ రోజురోజుకి భారీగా పెరిగింది. అది చివరికి., అతను దాని కోసం కలిగి ఉన్న డిస్‌ప్లే క్యాబినెట్‌ను అధిగమించి మొత్తం గదిని స్వాధీనం చేసుకుంది. 2018 నాటికి అతను 700కి పైగా వివిధ నోకియా మోడళ్లను సేకరించాడు. అలాగే ఇవే కాకుండా ఇతర బ్రాండ్‌ లను, అలాగే వాణిజ్యపరంగా అందుబాటులో లేని ఫోన్‌ లను కూడా సేకరించడం ప్రారంభించాడు.

Guinness World Record: వామ్మో.. నాలుకతోనే బయపెట్టేస్తుందిగా..

ఇకపోతే., నా సేకరణ యొక్క పరిణామం స్థిరంగా ఉంది. నేను దానిని సుమారు ఒక సంవత్సరం పాటు వదిలివేసినప్పటికీ, నోకియా మార్కెట్లోకి విడుదల చేసిన అన్ని ఫోన్‌లతో పాటు.. వాటిని పొందాలనే ఉద్దేశ్యంతో నేను తిరిగి రంగంలోకి దిగాను. ఇది అమ్మకానికి పెట్టలేదు. అవి మనందరికీ ప్రోటోటైప్‌ లుగా తెలిసిన ఫోన్‌లు. వెన్సెస్ తన సొంత వెబ్‌సైట్, నోకియా ప్రాజెక్ట్ డ్రీమ్‌లో తన రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్ వైపు తన ప్రయాణాన్ని డాక్యుమెంట్ చేసారు. ఆయన సేకరణలో ఇప్పుడు Simens, NEC, Motorola, Blackberry, Samsung, HTC, Apple ఇలా అనేక ఇతర బ్రాండ్‌ల ఫోన్‌లు కూడా ఉన్నాయి.

Show comments