NTV Telugu Site icon

Nokia Lay Off: 2000 మందికి పైగా ఉద్యోగులను తొలగించిన నోకియా..

Nokia

Nokia

ప్రముఖ టెక్ కంపెనీ నోకియా లేఆఫ్‌లు ప్రకటించింది. రాయిటర్స్ నివేదిక ప్రకారం.. కంపెనీ 2000 మందిని తొలగించింది. గ్రేటర్ చైనాలో నోకియా ఈ తొలగింపును చేసింది. అంతకుముందు ఖర్చులను తగ్గించుకునేందుకు యూరప్‌లో 350 మందిని కంపెనీ తొలగించింది. యూరప్‌లో ఉద్యోగుల తొలగింపులను కంపెనీ ప్రతినిధి ధృవీకరించారు. అయితే.. చైనాలో ఉద్యోగుల తొలగింపుపై మాత్రం ఏమీ స్పందించలేదు. ఈ వారం ప్రారంభంలో మెటా లేఆఫ్ కూడా లేఆఫ్‌లు ప్రకటించింది. వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, థ్రెడ్ విభాగాలలో ఈ తొలగింపు జరిగింది. అయితే.. ఎంత మందిని తొలగించారన్నది కంపెనీ ఎలాంటి సమాచారం ఇవ్వలేదు.

Read Also: AP Crime: ఇంటర్ విద్యార్థినిపై పెట్రోల్ దాడి.. ఆరా తీసిన సీఎం చంద్రబాబు

నోకియా వార్షిక నివేదిక ప్రకారం, గ్రేటర్ చైనాలో కంపెనీకి 10,400 మంది ఉద్యోగులు ఉన్నారు. యూరప్‌లో దాదాపు 37,400 మంది ఉద్యోగులు ఉన్నారు. ఖర్చులు తగ్గించడంతో పాటు 2026 నాటికి కంపెనీ సుమారు 868 మిలియన్ డాలర్ల నుంచి 1.2 బిలియన్ డాలర్ల(రూ. 7,300- 10 వేల కోట్లు) ఆదా చేయాలని నోకియా భావిస్తోంది. దీనికోసం గతేడాదిలోనే 14,000 మంది వరకు ఉద్యోగులను తగ్గించే ప్రణాళికను వెల్లడించింది. చైనాలో నోకియా మార్కెట్ బాగానే ఉంది. మరోవైపు హువావే, జెడ్‌టీఈ వంటి చైనా కంపెనీలపై అమెరికా నిషేధం విధిస్తోంది. దీని కారణంగా చైనా కంపెనీలు నోకియా, ఎరిక్సన్ ఒప్పందాలను తగ్గించుకున్నాయి. నోకియా 2019లో ఇచ్చిన సమాచారంలో తమ మొత్తం నికర అమ్మకాలలో 26 శాతం చైనా నుంచి వచ్చినట్లు తెలిపింది. ఇప్పుడు అది 6 శాతానికి తగ్గింది. ఇటీవలే కంపెనీ క్యాలెండర్ ఇయర్ మూడో త్రైమాసిక ఫలితాలను విడుదల చేసింది. కంపెనీ ఇచ్చిన సమాచారంలో.. తమ నిర్వహణ లాభంలో 9 శాతం పెరుగుదల ఉందని తెలిపింది. అయితే, నికర అమ్మకాలు అంచనాల కంటే తక్కువగానే ఉన్నాయి.

Read Also: Mumbai: చెంబూర్ రైల్వేస్టేషన్‌లో అగ్నిప్రమాదం.. భారీగా ఎగిసిపడుతున్న మంటలు