Nokia G42 5G Launch: శక్తివంతమైన బ్యాటరీతో నోకియా 5G స్మార్ట్‌ఫోన్.. అద్భుతమైన డిజైన్, సూపర్ ఫీచర్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nokia G42 5G Smartphone Launch and Price in India: ఫిన్‌లాండ్‌కు చెందిన ‘నోకియా’ మొబైల్ కంపెనీకి భారత మార్కెట్‌లో ఒకప్పుడు మంచి క్రేజ్ ఉంది. గతంలో నోకియా లేని వ్యక్తి ఉండడు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అయితే ప్రపంచ వ్యాప్తంగా మొబైల్ మార్కెట్‌ను షేక్ చేసిన నోకియా.. ఐఫోన్, శాంసంగ్, రెడ్‌మీ, ఒప్పో, మోటో ప్రభంజనంలో కనుమరుగయ్యిందనే చెప్పాలి. మరలా తన మార్కెట్‌ను దక్కించుకునేందుకు నోకియా ప్రయత్నాలు మొదలెట్టింది. ఈ క్రమంలో ఆండ్రాయిడ్ ఫోన్లు లాంచ్ చేస్తూ వస్తోంది. ప్రస్తుతం ఉన్న 5జీ ట్రెండ్‌ను అందిపుచ్చుకుంటూ.. నోకియా జీ42′ 5జీని తాజాగా ఆవిష్కరించింది.
Nokia G42 5G Launch:
నోకియా కంపెనీ తన కొత్త 5G స్మార్ట్‌ఫోన్ ‘నోకియా జీ42’ను త్వరలో భారత మార్కెట్‌లో విడుదల చేయబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. చివరకు ఇదే నిజమైంది. సెప్టెంబర్ 11న నోకియా జీ42ను లాంచ్ చేస్తున్నట్లు కంపెనీ ధృవీకరించింది. ఈ ఫోన్ శక్తివంతమైన బ్యాటరీ మరియు అద్భుతమైన డిజైన్‌తో రానుందట. అయితే ఈ ఫోన్ ఇప్పటికే యూరప్‌లో అందుబాటులో ఉంది. ఇది త్వరలో అమెజాన్‌లో అందుబాటులోకి రానుందని తెలుస్తోంది. నోకియా నుంచి భారతదేశంలో లాంచ్ కానున్న రెండవ 5G ఫోన్ ఇది.
Also Read
Nokia G42 5G Specs:
నోకియా జీ42 5జీ స్మార్ట్‌ఫోన్ 90Hz రిఫ్రెష్ రేట్ మరియు వాటర్‌డ్రాప్ నాచ్‌తో 6.56 ఇంచెస్ హెచ్‌డీ+ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది ఓజో ప్లేబ్యాక్-పవర్డ్ లౌడ్ స్పీకర్లను కలిగి ఉంది. ఈ ఫోన్‌లో 8-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా మరియు 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉన్నాయి. ఇందులో మాక్రో కెమెరా మరియు డెప్త్ సెన్సార్ కూడా ఉన్నాయి. స్నాప్‌డ్రాగన్ 480 ప్లస్ చిప్‌సెట్ మరియు 11GB వరకు ర్యామ్ కలిగి ఉంటుంది.
Also Read: World Cup 2023: అగార్కర్ పేరు ప్రకటించగానే.. సంతోషపడిన రోహిత్ శర్మ! వీడియో వైరల్
Nokia G42 5G Price:
నోకియా జీ42 5జీ ఫోన్ రెండు సంవత్సరాల ఆండ్రాయిడ్ ఓఎస్ అప్‌గ్రేడ్‌లను మరియు మూడు సంవత్సరాల వారెంటీతో రానుంది. ఈ స్మార్ట్‌ఫోన్ పర్పుల్ మరియు గ్రే కలర్ వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది. నోకియా జీ42 5G ధరను ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్‌లో వెల్లడించలేదు. అయితే ధర 20-25 వేల మధ్య ఉంటుందని సమాచారం. ఇది 128 GB ఇంటర్నల్ స్టోరేజ్, 5000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. ఇందులో సైడ్ ఫేసింగ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా ఉంది.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు