NTV Telugu Site icon

Nokia G42 5G Launch: శక్తివంతమైన బ్యాటరీతో నోకియా 5G స్మార్ట్‌ఫోన్‌.. అద్భుతమైన డిజైన్‌, సూపర్ ఫీచర్స్!

Nokia G42 5g New

Nokia G42 5g New

Nokia G42 5G Smartphone Launch and Price in India: ఫిన్‌లాండ్‌కు చెందిన ‘నోకియా’ మొబైల్ కంపెనీకి భారత మార్కెట్‌లో ఒకప్పుడు మంచి క్రేజ్ ఉంది. గతంలో నోకియా లేని వ్యక్తి ఉండడు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అయితే ప్రపంచ వ్యాప్తంగా మొబైల్ మార్కెట్‌ను షేక్ చేసిన నోకియా.. ఐఫోన్, శాంసంగ్‌, రెడ్‌మీ, ఒప్పో, మోటో ప్రభంజనంలో కనుమరుగయ్యిందనే చెప్పాలి. మరలా తన మార్కెట్‌ను దక్కించుకునేందుకు నోకియా ప్రయత్నాలు మొదలెట్టింది. ఈ క్రమంలో ఆండ్రాయిడ్ ఫోన్లు లాంచ్ చేస్తూ వస్తోంది. ప్రస్తుతం ఉన్న 5జీ ట్రెండ్‌ను అందిపుచ్చుకుంటూ.. నోకియా జీ42′ 5జీని తాజాగా ఆవిష్కరించింది.

Nokia G42 5G Launch:
నోకియా కంపెనీ తన కొత్త 5G స్మార్ట్‌ఫోన్‌ ‘నోకియా జీ42’ను త్వరలో భారత మార్కెట్‌లో విడుదల చేయబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. చివరకు ఇదే నిజమైంది. సెప్టెంబర్ 11న నోకియా జీ42ను లాంచ్ చేస్తున్నట్లు కంపెనీ ధృవీకరించింది. ఈ ఫోన్ శక్తివంతమైన బ్యాటరీ మరియు అద్భుతమైన డిజైన్‌తో రానుందట. అయితే ఈ ఫోన్ ఇప్పటికే యూరప్‌లో అందుబాటులో ఉంది. ఇది త్వరలో అమెజాన్‌లో అందుబాటులోకి రానుందని తెలుస్తోంది. నోకియా నుంచి భారతదేశంలో లాంచ్ కానున్న రెండవ 5G ఫోన్ ఇది.

Nokia G42 5G Specs:
నోకియా జీ42 5జీ స్మార్ట్‌ఫోన్‌ 90Hz రిఫ్రెష్ రేట్ మరియు వాటర్‌డ్రాప్ నాచ్‌తో 6.56 ఇంచెస్ హెచ్‌డీ+ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది ఓజో ప్లేబ్యాక్-పవర్డ్ లౌడ్ స్పీకర్లను కలిగి ఉంది. ఈ ఫోన్‌లో 8-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా మరియు 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉన్నాయి. ఇందులో మాక్రో కెమెరా మరియు డెప్త్ సెన్సార్ కూడా ఉన్నాయి. స్నాప్‌డ్రాగన్ 480 ప్లస్ చిప్‌సెట్ మరియు 11GB వరకు ర్యామ్ కలిగి ఉంటుంది.

Also Read: World Cup 2023: అగార్కర్‌ పేరు ప్రకటించగానే.. సంతోషపడిన రోహిత్ శర్మ! వీడియో వైరల్

Nokia G42 5G Price:
నోకియా జీ42 5జీ ఫోన్ రెండు సంవత్సరాల ఆండ్రాయిడ్ ఓఎస్ అప్‌గ్రేడ్‌లను మరియు మూడు సంవత్సరాల వారెంటీతో రానుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ పర్పుల్ మరియు గ్రే కలర్ వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది. నోకియా జీ42 5G ధరను ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్‌లో వెల్లడించలేదు. అయితే ధర 20-25 వేల మధ్య ఉంటుందని సమాచారం. ఇది 128 GB ఇంటర్నల్ స్టోరేజ్, 5000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. ఇందులో సైడ్ ఫేసింగ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా ఉంది.