తాజాగా నోయిడాకు చెందిన 41 ఏళ్ల వ్యాపారవేత్త 9 కోట్ల రూపాయల మేర సైబర్ వలలో మోసపోయారు. సైబర్ మోసంలో చిక్కుకున్న ఆయన ఏకంగా 9.09 కోట్ల రూపాయలను పోగొట్టుకున్నాడు. నోయిడాలోని సెక్టర్ 40 కి చెందిన రజిత్ బోత్ర ఏప్రిల్ 28న ఓ లాభదాయమైన షేర్ మార్కెటింగ్ ట్రేడింగ్ చిట్కాలను అందించే వాట్సప్ గ్రూపులో చేరడం జరిగింది. అలా చేరిన నెల రోజుల లోపల ఈ రేంజ్ లో అతను మోసపోయాడు.
Committee Kurrollu: ‘ఆ రోజులు మళ్లీ రావు’ అంటున్న ‘కమిటీ కుర్రోళ్లు’..
ఇక ఈ కేసు సంబంధించిన పోలీసులు అందించిన సమాచారం మేరకు.. వాట్సప్ లో ఆన్లైన్ షేర్లు కొనడానికి ఓ యాప్ ను ఇన్స్టాల్ చేసుకోవాల్సిందిగా సదరు గ్రూప్ లో తెలియజేశారని., దాంతో అతడు ఓ నకిలీ యాప్ ను డౌన్లోడ్ చేసి అందులో ట్రేడింగ్ వ్యవహారాలను చేసినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో మే 27 నాటికి అతడు 9.09 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టినట్లు పోలీసులు తెలిపారు. ఇక బాధితుడి ఖాతాలో అక్రమంగా జరిగిన లావాదేవీలు 1.62 కోట్ల నిధులను స్తంభింపచేసినట్లు పోలీసులు తెలిపారు. అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ వివేక్ రంజన్ ఈ విషయాలను తెలిపారు.
Indian 2: ఆయన నమ్మకమే ‘భారతీయుడు 2’.. కమల్ హాసన్ కీలక వ్యాఖ్యలు..
ఓ ప్రత్యేక పోలీసుల బృందం సైబర్ నేరగాళ్ల ఆచూకీ తెలుసుకొనేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా బాధితుడు రజిత మాట్లాడుతూ.. తాను మే 27 నాటికి 13 వాయిదాలలో మొత్తం 9.09 కోట్ల రూపాయల నగదు బదిలీ చేసి షేర్స్ కొన్నట్లు తెలిపారు. అయితే అవసరం కొద్ది తాను డబ్బు ఉపసంహరణకు ప్రయత్నిస్తున్న సమయంలో అప్లికేషన్ దానిని అనుమతించట్లేదని ఆయన చెప్పుకొచ్చారు. నకిలీ లింకులు, అలాగే వెబ్సైట్ లింకులు సృష్టించి షేర్ మార్కెటింగ్ లో లాభాల పేరుతో తన డబ్బులను స్వాహా చేసినట్లు అతను తెలిపారు. ఈ కేసుకు సంబంధించి సెక్టార్ 36 లోని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో సెక్షన్ 419, 420 చట్టాల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది.