నోయిడాలో పట్టపగలే దారుణ ఘటన చోటు చేసుకుంది. కారులో వెళ్తున్న వ్యక్తిని బైక్‌పై వచ్చిన ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు గన్ తో కాల్చారు. జిమ్ నుంచి తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. మృతుడు సూరజ్ భాన్ గా గుర్తించారు. నిందితులు ఐదు రౌండ్ల కాల్పులు జరిపారు.
Read Also: Ayodhya: అతిథుల చార్టర్డ్ విమానాల పార్కింగ్.. 12 ఎయిర్ పోర్టులను సంప్రదించిన ఆలయ ట్రస్ట్
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సూరజ్ భాన్ అనే వ్యక్తి జిమ్ నుంచి వచ్చి తన కారులో ఎక్కి కూర్చోగానే గుర్తు తెలియన వ్యక్తులు కాల్చారని చెప్పారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న తర్వాత.. వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ఆ వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. కాగా.. ఆ వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహించామని, ఈ కాల్పులకు సంబంధించి కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
Read Also: Viral Video : థాయ్ ఎయిర్ ఏషియా బ్యాంకాక్-ఫుకెట్ విమానంలో పాము..వీడియో వైరల్..
ఈ ఘటనపై నోయిడా డీసీపీ హరీష్ చందర్ మాట్లాడుతూ.. సూరజ్‌భాన్ అనే వ్యక్తి జిమ్ నుండి వచ్చి తన కారులో కూర్చున్న వెంటనే కొంతమంది దుండగులు అతనిని కాల్చారన్నారు. అతన్ని ఆసుపత్రికి తరలించేలోపే మరణించాడని డీసీపీ తెలిపారు. ఈ ఘటనలో నాలుగు వేర్వేరు పోలీసు బృందాలు విచారణ చేపట్టాయని, దర్యాప్తులో భాగంగా సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నట్లు చెప్పారు.
కాగా.. ఇంతకు ముందు గ్రేటర్ నోయిడాలో 40 ఏళ్ల వ్యక్తిని గుర్తు తెలియని అనుమానితులు కాల్చి చంపారు. తాజాగా ఈ ఘటన జరిగింది.