చేసిన అభివృద్ధి పనులకు బిల్లులు చెల్లించకుండా అదనంగా పనులు చెప్పడం కరెక్ట్ కాదని వికారాబాద్ జిల్లాలోని పరిగి మండలం తొండపల్లి గ్రామ సర్పంచ్ మోముల గీత బీఆర్ఎస్ ప్రభుత్వ తీరును, అధికారులు తీరును తప్పు పట్టారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని శుక్రవారం తొండపల్లిలో సర్పంచ్ మోముల గీత, నాయకులు హనుమంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్, సోనియా గాంధీ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ముందుగా తెలంగాణ రాష్ట్రమిచ్చిన సోనియా గాంధీకి మనందరం కృతజ్ఞతలు తెలుపాలన్నారు గీత.
Richard rishi : కూతురు వయసున్న హీరోయిన్ తో నటుడు ప్రేమాయణం?
బీఆర్ఎస్ ప్రభుత్వం, అధికారులు ప్రతి అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలు చేయమని చెబుతున్నారే తప్పా సర్పంచుల ఆర్థిక పరిస్థితులను అర్థం చేసుకోవడం లేదని ఆమె తప్పు పట్టారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది కానీ ఇలా 20 రోజుల వరకు చేయాలంటే సర్పంచులకు భారమేనని ఆమె వ్యాఖ్యనించారు. తొండపల్లి సర్పంచ్ మోముల గీతకు మద్దతు చిట్యాల సర్పంచ్ బద్రి గారి రజిత కూడ అధికారులు బీఆర్ఎస్ ప్రభుత్వ తీరును తప్పుపట్టారు. ఈ కార్యక్రమంలో హనుమంత్ రెడ్డి, బద్రి గారి రాజ్ పుల్లారెడ్డి, తొండపల్లి, చిట్యాల గ్రామస్తులు పాల్గొన్నారు.
Tirumala Ghat Road Accidents: తిరుమల ఘాట్ రోడ్డులో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలు.. భక్తుల్లో భయం