Site icon NTV Telugu

No Tax Paid : టాక్స్ చెల్లించలేదని ప్రైవేట్ స్కూల్ కి తాళం వేసిన మున్సిపల్ అధికారులు..!

13

13

పల్లెలో కానీ, పట్టణంలో కానీ ఎక్కడైనా సరే సొంతభూమి కలిగి ఉంటే మాత్రం కచ్చితంగా ట్యాక్స్ చెల్లించాల్సిందే. ఒకవేళ సరైన సమయానికి టాక్స్ పే చేయకుండా ఉంటే దానికి అదనంగా వడ్డీ కూడా కలుపుతూ ప్రజల నుంచి ఆస్తి పన్నును ప్రభుత్వ అధికారులు కలెక్ట్ చేస్తారు. అలా ఎవరైనా ప్రాపర్టీ టాక్స్ కట్టుకోకపోతే మొదటగా వారికి నోటీసులు జారీ చేసి ఆపై వాటిని సీజ్ చేస్తారు సంబంధిత ప్రభుత్వ అధికారులు. తాజాగా ఇలాంటి సంఘటన ఒకటి తెలంగాణలోని ఆర్మూర్ లో జరిగింది. వీటికి సంబంధించి పూర్తి వివరాలు చూస్తే..

Also read: GHMC Hyderabad: పన్నులు కట్టకుంటే కఠిన చర్యలు.. జీహెచ్‌ఎంసీ హెచ్చరిక

ఆర్మూర్ మున్సిపల్ రెవెన్యూ పరిధిలో ఉన్న స్కూలుకి తాజాగా అధికారులు తాళం వేశారు. ఆర్మూర్ నగరం లోని ఓ ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం ప్రాపర్టీ టాక్స్ కింద 5.50 లక్షల రూపాయలు మున్సిపాలిటీకి చెల్లించాల్సి ఉంది. అయితే దానిని స్కూల్ యాజమాన్యం పట్టించుకోకపోవడంతో అధికారులు ఇలా చేయాల్సి వచ్చింది.

Also read: GHMC Hyderabad: పన్నులు కట్టకుంటే కఠిన చర్యలు.. జీహెచ్‌ఎంసీ హెచ్చరిక

ప్రాపర్టీ టాక్స్ సంబంధించి ఇప్పటికే మూడుసార్లు అధికారులు నోటీసులు జారీ చేసినప్పటికీ.. స్కూల్ యాజమాన్యం చెల్లించకపోవడంతో మునిసిపల్ రెవెన్యూ ఆఫీసర్ ఆధ్వర్యంలో స్కూల్ బిల్డింగ్ గేటుకు తాళం వేసి స్కూల్ ను సీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ మున్సిపల్ రెవెన్యూ బృందం మొత్తం పాల్గొన్నారు.

Exit mobile version