Mallikarjun Kharge: కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వంపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే శనివారం మండిపడ్డారు. దేశంలో వాక్ స్వాతంత్య్రం లేదని ఆరోపించారు. జార్ఖండ్‌లోని సాహెబ్‌గంజ్ జిల్లాలో జరిగిన ర్యాలీలో ప్రసంగిస్తూ.. పార్లమెంటులో తన ప్రసంగంలోని కొన్ని భాగాలను తొలగించారని పేర్కొంటూ ఖర్గే ఆవేదన వ్యక్తం చేశారు. పార్లమెంటు లోపల కానీ, బయట కానీ వాక్ స్వాతంత్య్రం లేదని.. మాట్లాడే ధైర్యం ఉన్న వారిని కటకటాల వెనక్కి నెట్టారని ఆయన ఆరోపించారు.
G20 Food Festival: టేస్ట్ ది వరల్డ్.. ఢిల్లీలో 2-రోజుల పాటు జీ20 ఇంటర్నేషనల్ ఫుడ్ ఫెస్టివల్
2014లో ద్రవ్యోల్బణాన్ని నిలువరిస్తామనే హామీతో బీజేపీ అధికారంలోకి వచ్చిందని, అయితే అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నిత్యావసర వస్తువుల ధరలు, పేదరికం పెరుగుతున్నాయన్నారు. దేశంలో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసి భారతదేశ స్వాతంత్ర్యం కోసం పోరాడింది కాంగ్రెస్సేనని ఖర్గే అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 60 రోజుల ‘హాత్ సే హాత్ జోడో’ కార్యక్రమాన్ని ప్రారంభించిన తర్వాత కాంగ్రెస్ అధ్యక్షుడు పాకూర్‌లోని గుమాని గ్రౌండ్‌లో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు ఇంటింటికీ తిరుగుతూ కేంద్రం అనుసరిస్తున్న విధానాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తారు. ఈ ర్యాలీలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అవినాష్ పాండే, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు రాజేష్ ఠాకూర్, రాష్ట్ర మంత్రి అలంగీర్ ఆలం తదితరులు పాల్గొన్నారు.