Site icon NTV Telugu

Delhi Metro: హోలీ రోజున ప్రయాణికులకు ఢిల్లీ మెట్రో అలర్ట్

Delhi Metro

Delhi Metro

ప్రయాణికులకు ఢిల్లీ మెట్రో అధికారులు కీలక ప్రకటన చేసింది. మార్చి 25న అనగా హోలీ పండుగ రోజు మెట్రో రైలు ప్రయాణ సమయాల్లో మార్పులు చోటుచేసుకున్నాయని తెలిపింది. హోలీ నేపథ్యంలో సోమవారం అన్ని లైన్లలోని టెర్మినల్ స్టేషన్ల నుంచి మధ్యాహ్నం 2:30 గంటలకు మెట్రో రైలు సర్వీసులు ప్రారంభమవుతాయని తెలిపింది.

హోలీ పండుగ కోసమే టైమింగ్స్ మార్చినట్లు అధికారులు వెల్లడించారు. సమయ మార్పులను ప్రయాణికులు గమనించాలని విజ్ఞప్తి చేశారు. మార్చి 25న మధ్యాహ్నం 2:30 గంటలకు మెట్రో రైళ్లు సేవలు ప్రారంభమవుతాయని ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ ప్రయాణికులకు సూచించింది. ర్యాపిడ్ మెట్రో/ఎయిర్‌పోర్ట్ ఎక్స్‌ప్రెస్ లైన్‌తో సహా అన్ని లైన్లలో నిర్ణీత సమయానికి ముందు ఎలాంటి సేవలు అందుబాటులో ఉండవని తెలిపింది. మధ్యాహ్నం 2:30 గంటల తర్వాత యథావిథిగా అన్ని సేవలు పున:ప్రారంభమవుతాయని వెల్లడించింది.

ఇది కూడా చదవండి: Gorantla Butchaiah Chowdary: విశాఖ పోర్టులో దొరికిన డ్రగ్స్ పై సమగ్రవిచారణ జరపాలి..

ఇదిలా ఉంటే ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను గురువారం ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. అనంతరం ఆప్ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తకుండా.. ఎలాంటి దాడులు జరగకుండా పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఇక పోలీసుల సూచన మేరకు శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం 6 గంటల వరకు పలు స్టేషన్లు మూసివేసినట్లు ఢిల్లీ మెట్రో అధికారులు వెల్లడించారు.

 

Exit mobile version