ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు ఢిల్లీ కోర్టులో చుక్కెదురైంది. ఆయన వేసిన రెండు పిటిషన్లలో ఉపశమనం లభించలేదు. సుప్రీంకోర్టు కల్పించిన మధ్యంతర బెయిల్ కొనసాగించాలని.. వైద్య పరీక్షల కోసం రెగ్యులర్ బెయిల్ ఇవ్వాలని ఆయన పిటిషన్లు వేసుకున్నారు. కానీ రెండింటిలో రిలీఫ్ దొరకలేదు. బెయిల్ విచారణ జూన్ 7కి రౌస్ అవెన్యూ న్యాయస్థానం వాయిదా వేసింది. దీంతో కేజ్రీవాల్ ఆదివారం తీహార్ జైల్లో సరెండర్ కానున్నారు.
ఇది కూడా చదవండి: Gautam Adani: అంబానీని వెనక్కి నెట్టిన అదానీ..ఆసియా కుబేరుల జాబితాలో టాప్
మార్చి 21న లిక్కర్ పాలసీ కేసులో కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. అనంతరం రెండు సార్లు ఈడీ కస్టడీకి అనుమతి ఇచ్చింది. అటు తర్వాత జ్యుడీషియల్ కస్టడీ విధించడంతో ఏప్రిల్ 1న తీహార్ జైలుకు తరలించారు. అనంతరం రెగ్యులర్ బెయిల్ పిటిషన్ వేసినా ఉపశమనం లభించలేదు. ఇక సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ రావడం.. ప్రచారం చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. దీంతో పార్టీ అధ్యక్షుడిగా ప్రచారం చేయాల్సిన బాధ్యత ఉందంటూ తనకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కేజ్రీవాల్ సుప్రీకోర్టును ఆశ్రయించారు. దీంతో ఆయనకు జూన్ 1 వరకు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. మొత్తం 21 రోజులు బెయిల్ లభించింది. ఈ గడువు శనివారంతో ముగియనుంది.
ఇది కూడా చదవండి: Arvind Kejriwal: కేజ్రీవాల్ కోసం అంబులెన్స్ పంపిన బీజేపీ నాయకుడు.. ఎందుకంటే..
ఇక మధ్యంతర బెయిల్ పొడిగించాలని.. అలాగే రెగ్యులర్ బెయిల్ ఇవ్వాలని ఇటీవల రౌస్ అవెన్యూ కోర్టులో కేజ్రీవాల్ పిటిషన్ వేశారు. దీనికి ఈడీ అభ్యంతరం వ్యక్తం చేసింది. తాజాగా శనివారం మరోసారి విచారణ చేపట్టింది. విచారణను జూన్ 7కి వాయిదా వేసింది. ధర్మాసనం ఊరట ఇవ్వకపోవడంతో కేజ్రీవాల్ ఆదివారం తీహార్ జైల్లో లొంగిపోనున్నారు.
ఇది కూడా చదవండి: JP Nadda: ఆందోళన వద్దు.. దేశ ప్రజలంతా మోడీ వైపే..!