Site icon NTV Telugu

No Confidence Motion: మూజువాణి ఓటుతో వీగిన అవిశ్వాస తీర్మానం

Voice Vote

Voice Vote

No Confidence Motion: కేంద్రంపై విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం లోక్‌సభలో వీగిపోయింది. మూజువాణి ఓటుతో అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. లోక్‌సభలో విపక్షాల వాకౌట్‌ చేయడంతో ఓటింగ్‌ లేకుండానే అవిశ్వాస తీర్మానం వీగిపోయింది.

ఇదిలా ఉండగా.. కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి లోక్‌సభ నుంచి సస్పెండ్ అయ్యారు. పార్లమెంట్‌లో బీజేపీ నేత ప్రహ్లాద్ జోషి ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఆమోదించడంతో కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరిని లోక్‌సభ నుంచి సస్పెండ్ చేశారు. ప్రివిలేజెస్ కమిటీ అధిర్ రంజన్ చౌదరికి వ్యతిరేకంగా తన నివేదికను సమర్పించే వరకు సస్పెండ్ చేయబడతారు.

పార్లమెంటరీ కార్యకలాపాల సమయంలో చౌదరి నిరంతరం ఆటంకాలు కలిగిస్తున్నారని, దేశాన్ని, దేశ ప్రతిష్టను కించపరిచారని ప్రహ్లాద్ జోషి ఆరోపించారు. “ఇది అలవాటుగా మారింది. పదేపదే హెచ్చరించినప్పటికీ ఆయన తనను తాను మెరుగుపర్చుకోలేదు. తన చర్చల్లో ఎప్పుడూ నిరాధారమైన ఆరోపణలు చేస్తుంటారు. ఆయన దేశాన్ని, దేశ ప్రతిష్టను కించపరుస్తారు. ఎప్పుడూ క్షమాపణ చెప్పరు.” అని ప్రహ్లాద్ జోషి అన్నారు.

Exit mobile version