NTV Telugu Site icon

PPF: పీపీఎఫ్ ఖాతాదారులకు కేంద్రం గుడ్ న్యూస్.. ఇకపై ఛార్జీలుండవ్

Nirmalasitharaman

Nirmalasitharaman

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పీపీఎఫ్ ఖాతాలో నామినీ పేరును అప్ డేట్ చేయడానికి లేదా జోడించడానికి ఇకపై ఎటువంటి ఫీజు ఉండదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. పీపీఎఫ్ లో నామినీ మార్చుకునేందుకు ఇకపై ఛార్జీలుండవు అని దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ను కేంద్ర ప్రభుత్వం జారీ చేసింది.

Also Read:TDR bonds: టీడీఆర్ బాండ్ల జారీ.. తిరుపతిలో రేపు స్పెషల్ డ్రైవ్

PPF ఖాతాలలో నామినీ వివరాలను సవరించడం కోసం ఆర్థిక సంస్థలు ఛార్జీలు విధిస్తున్నాయని ఇటీవల తమ దృష్టికి వచ్చిందని ఆర్థిక మంత్రి తన పోస్ట్‌లో పేర్కొన్నారు. “ప్రభుత్వ పొదుపు ప్రమోషన్ జనరల్ రూల్స్, 2018లో ఏప్రిల్ 2, 2025 నాటి గెజిట్ నోటిఫికేషన్ ద్వారా అవసరమైన మార్పులు చేయబడ్డాయి, PPF ఖాతాలకు నామినీల మార్పుపై ఛార్జీని తొలగించడం జరిగింది. గెజిట్ నోటిఫికేషన్ ద్వారా.. చిన్న పొదుపు పథకాలకు నామినేషన్ రద్దు లేదా మార్పు కోసం రూ. 50 రుసుము రద్దు చేయబడింది” అని నిర్మలా సీతారామన్ అన్నారు. పార్లమెంటులో ఆమోదించబడిన బ్యాంకింగ్ సవరణ బిల్లు 2025 నిబంధనల ప్రకారం, ఇప్పుడు బ్యాంకు ఖాతాదారుల డబ్బు, లాకర్ల చెల్లింపు కోసం నలుగురు వ్యక్తులను నామినీలుగా చేర్చుకోవడానికి అనుమతిస్తుందని ఆర్థిక మంత్రి అన్నారు.