Site icon NTV Telugu

Nizams’s Petrol Pump : బయటపడ్డ నిజాం కాలం నాటి పెట్రోల్‌ పంపు

Nizam Petrol Pump

Nizam Petrol Pump

నగరంలోని కేబీఆర్ నేషనల్ పార్క్‌లో ఉన్న హైదరాబాద్ నిజాం ప్రైవేట్ పెట్రోల్ పంపు అందరి దృష్టిని ఆకర్షించింది. కేబీఆర్ ఉద్యానవ నంలో నిజాం కాలం నాటి పెట్రోల్ పంపు ఒకటి బయటపడడంతో ఇప్పుడు సోషల్‌ మీడియాతో వైరల్‌గా మారింది. కేబీఆర్‌ పార్క్‌కు వాకింగ్‌కు వచ్చే పాదచారులు అటుగా సాగుతున్న క్రమంలో దీనిని గుర్తించారు. ఇంకేముంది.. ఈ పెట్రోల్‌ పంపుకు సంబంధిత ఫోటోలను సోషల్‌ మీడియాలో పెట్టారు. నిజాం – తన కార్లు, ట్రక్కులు ఇతర మోటారు ఇంధనం యంత్రాలలో నింపేందుకు దీనిని ఉపయోగించినట్లు తెలుస్తోంది. ఓ వ్యక్తి ఈ పెట్రోల్ పంపు చిత్రాలను తన ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్ చేశారు.

jaipur: గజరాజుకు కోపం తెప్పించారు.. ఆ తర్వాత ఏం చేసిందంటే..!

ఇన్నాళ్లూ చెట్ల పొదల్లో దాగి ఉన్న ఈ పెట్రోల్ పంపు వేసవి కావడంతో పచ్చదనం తగ్గి బయటపడింది. గత సంపదకు ఇదే సాక్ష్యం అంటూ రాజు అల్లూరి తన ఖాతాలో పేర్కొన్నారు. ఈ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లోనూ కనిపించడంతో ఇప్పుడు ఇక్కడి పెట్రోల్ పంపును చూడటా నికి నడకదారులు ఆసక్తి చూపుతున్నారు. పార్క్ మొత్తం వైశాల్యం, గతంలో జూబ్లీ హిల్స్ ఫారెస్ట్ బ్లాక్ అని పిలువబడింది, ఇది 142.5 హెక్టార్లు. గతంలో హైదరాబాద్ నిజాం ఆధీనంలో ఉన్న ఈ పార్కును అర్బన్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ కింద ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. అయితే, 2.4 హెక్టార్లలో కొంత భాగం నిజాం ఆధీనంలో ఉంది. ప్రైవేట్ పెట్రోల్ పంప్ కూడా ఈ ప్రాంతాలలో ఒకదానిలో పూర్వపు పాలకుల ఆధీనంలో ఉంది.

Sree Vishnu: శ్రీ విష్ణు పుట్టినరోజు.. మైండ్ బ్లాకయ్యే గిఫ్ట్ ఇచ్చిన అల్లు అరవింద్

Exit mobile version