Site icon NTV Telugu

Nizamabad : నిజామాబాద్ లో సినిమాటిక్ సీన్.. దొంగల కోసం పోలీసుల ఛేజింగ్

Ts Police Recruitment 2022

Ts Police Recruitment 2022

Nizamabad : కార్లతో భారీ ఛేజింగ్ సీన్లు సినిమాల్లో చూసి మనం తెగ ఎంజాయ్ చేస్తుంటాం. నిజంగా అలా జరుగుతుందా అని ఓ సారి ఆశ్చర్యపోతుంటాం. నిజంగా రియల్ లైఫ్ లో అలాంటిదే జరిగితే చూస్తే థ్రిల్ అనిపిస్తుంది కదూ. అచ్చం సినిమాలో లాగే దొంగ‌లను పోలీసులు వెంబ‌డించారు. వారు త‌ప్పించుకునే క్రమంలో సినిమా రేంజ్ లో ఛేజింగ్ చేస్తూ… దొంగ‌ల‌పై పోలీసులు కాల్పులు జ‌రిపారు. ఈ ఘ‌ట‌న తెలంగాణ‌లోని నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది.

Read Also:BJP: చిన్మయి-వైరముత్తు ఇష్యూపై బీజేపీ కామెంట్స్.. సీఎం స్టాలిన్‌పై అన్నామలై ఆగ్రహం..

వివరాల్లోకి వెళితే.. నిజామాబాద్‌లోని ఇందల్వాయి మండలం నేషనల్ హైవేపై దొంగలను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. అయితే, పోలీసుల నుంచి దొంగ‌లు త‌ప్పించుకోవ‌డానికి భారీ ప్రయత్నాలే చేశారు. ఛేజింగ్ చేసే క్రమంలో పారిపోతున్న దొంగలపై పోలీసులు కాల్పులు జరిపారు. గ‌త కొంత కాలంగా ఈ ప్రాంతంలో దొంగ‌ల హడావుడి ఎక్కువైంది. ఈ దొంగ‌ల ముఠా స‌భ్యుల‌ను రాజస్థాన్‌కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. పోలీసులు వారిని ప‌ట్టుకోవ‌డానికి ప‌క్కా ప్లాన్తో.. దొంగ‌ల ముఠాను పట్టుకునేందుకు మాటు వేశారు. అయితే, ఈ విష‌యం తెలుసుకున్న దొంగ‌లు పోలీసుల కారును ఢీకొట్టి పారిపోయారు. ఈ క్రమంలోనే వారిని పట్టుకునేందుకు పోలీసులు రెండు రౌండ్ల కాల్పులు జరిపారు. దొంగలను పట్టుకునేందుకు పోలీసులు బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు నిర్వహించారు.

Read Also:Karimnagar: సుఖాంతమైన పాప కథ.. ఏడేళ్ల తర్వాత తల్లి ఒడికి చేరిన బాలిక

Exit mobile version