Nizamabad: నిజామాబాద్ మేయర్ పీఠంపై వీడిన ఉత్కంఠ.. బీజేపీ సంచలన ప్రకటన!

Bjp

Bjp

Nizamabad: నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో మేయర్ పీఠంపై ఉత్కంఠ వీడింది. నిజామాబాద్ కార్పొరేషన్‌లో ప్రతిపక్షంలో ఉంటామని బీజేపీ సంచలన ప్రకటన చేసింది. మరోవైపు.. నిజామాబాద్ మేయర్ పీఠం దక్కించుకునే పనిలో కాంగ్రెస్ బిజీగా ఉంది.. ఇప్పటికే పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఎంఐఎం మద్దతు కోరారు.. కాంగ్రెస్ ప్రస్తుతం క్యాంపు పాలిటిక్స్‌కు తెరలేపింది. 60 డివిజన్లు ఉన్న నిజామాబాద్‌లో హంగ్ ఫలితాలు వచ్చాయి. అత్యధికంగా 28 సీట్లను బీజేపీ గెలుచుకుంది. మరోవైపు కాంగ్రెస్‌కు 17, ఎంఐఎంకు 14 సీట్లు వచ్చాయి. ఇద్దరు ఎక్స్ అఫీషియోల్లో ఒకరకు ఎమ్మెల్యే భూపతిరెడ్డి, మరొకరు మహేష్‌కుమార్ గౌడ్ ఉన్నారు. ఈ అంశంపై తాజాగా ఎంపీ ధర్మపురి అరవింద్ స్పందించారు. “నిజామాబాద్‌లో మెజార్టీ రాలేదు.. ప్రతిపక్షంలో ఉంటాం. మేయర్ పదవీకాలం ముగిసేలోపు నిజామాబాద్ పేరు ఇందూరుగా మార్చే ప్రయత్నం చేస్తాం.. ఆర్మూర్ ఎన్నికల ఫలితాలపై విశ్లేషణ చేస్తాం.. ఆర్మూర్ ప్రజలకు క్షమాపణలు చెబుతున్నాం..” అని అరవింద్ తెలిపారు.

READ MORE: India vs Pakistan: తాజా రిపోర్ట్స్‌తో కొత్త టెన్షన్.. భారత్-పాక్ మ్యాచ్ జరుగుతుందని పూర్తిగా చెప్పలేం!