NTV Telugu Site icon

MLC Kavitha on IT HUB: నిజామాబాద్‌లో త్వరలో ఐటీ హబ్‌ ప్రారంభం

Mlc Kavitha

Mlc Kavitha

MLC Kavitha on IT HUB: నిజామాబాద్‌లో రూ.50 కోట్లతో నిర్మిస్తున్న ఐటీ హబ్‌ను త్వరలో ప్రారంభించనున్నామని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. శనివారం నిజామాబాద్‌లో ఐటీ హబ్‌ భవన సముదాయాన్ని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేశ్‌ గుప్తా, బీఆర్ఎస్ ఎన్నారై సెల్ కోఆర్డినేటర్ మహేశ్‌ గుప్తాతో కలిసి పరిశీలించారు. చివరి దశకు చేరుకున్న పనులను, భవనంలో మౌలిక సదుపాయాల వివరాలను ఆమె అడిగి తెలుసుకున్నారు. నిజామాబాద్‌లో ఐటీ హబ్‌ నిర్మాణానికి ఎంతో శ్రద్ధ ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్‌కు ఆమె ధన్యవాదాలు తెలిపారు.

Read Also: CM Jagan: ఏపీని పారిశ్రామిక హబ్‌గా తీర్చిదిద్దుతాం.. 13 లక్షల కోట్ల పెట్టుబడులొచ్చాయి

యువతకు ఉపాధి కల్పన లక్ష్యంగా ఐటీ హబ్ నిర్మాణం జరుగుతోంది.. రూ.50 కోట్ల వ్యయంతో 750 మంది యువతకు, 4 వేల మంది ఇతర ప్రాంత వాసులకు ఉద్యోగ, ఉపాధికి అవకాశం లభిస్తుందని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. ద్వితీయ శ్రేణి నగరాలకు ఐటీ కంపెనీలను తీసుకువెళ్లాలని సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఐటీ హబ్‌లను నిర్మిస్తున్నారని కవిత వెల్లడించారు. అతి త్వరలో కేటీఆర్ చేతుల మీదుగా ఐటీ హబ్‌ను ప్రారంభిస్తామని ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు. ఇంకా ఎన్నో పరిశ్రమలు నిజామాబాద్‌కు రానున్నాయన్నారు. జిల్లాలో విమానాశ్రయ ఏర్పాటు అంశాన్ని కూడా పరిశీలిస్తున్నామని కవిత తెలిపారు. తెలంగాణలో కలలు కన్న ప్రగతి సాధ్యమవుతుందని ఆమె అన్నారు.

Show comments