NTV Telugu Site icon

Nitish Kumar: హిస్టరీ క్రియేట్ చేయబోతున్న నితీష్.. ఈ రికార్డ్ బ్రేక్ చేసేదెవరో?

Nitish Kumar

Nitish Kumar

జేడీయూ అధినేత నితీష్‌కుమార్ సరికొత్త రికార్డ్ సృష్టించబోతున్నారు. బీహార్‌లోనే కాదు దేశంలోనే నితీష్ హిస్టరీ క్రియేట్ చేయబోతున్నారు. ఇప్పటికే ఆయన 8 సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయగా.. తాజాగా మరోసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేసేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో ఆయన దేశంలోనే అత్యధిక సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన నాయకుడిగా చరిత్ర సృష్టించబోతున్నారు.

నితీష్‌కుమార్ తొలిసారిగా 2000 సంవత్సరంలో కేవలం 7 రోజులే బీహార్ ముఖ్యమంత్రిగా కొనసాగారు. అప్పటినుంచి ఇప్పటివరకు ఎనిమిది సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. జనవరి 28, 2024న సాయంత్రం 5 గంటలకు మరోసారి బీహార్ సీఎంగా ప్రమాణం చేయనున్నారు. దేశంలో ఆయా రాష్ట్రాల్లో సుదీర్ఘ కాలం ముఖ్యమంత్రులుగా కొనసాగిన వాళ్లు కూడా నితీష్ ముందు వెనుకబడిపోయారు.

Read Also: Breaking News: వచ్చే నెల రెండోవారంలో ఏపీ అసెంబ్లీ సమావేశాలు..!

ఇప్పటివరకు ఎవరెన్ని సార్లు సీఎంగా ప్రమాణస్వీకారం చేశారంటే..!

వీరభద్ర సింగ్..
హిమాచల్ ప్రదేశ్ సీఎంగా వీరభద్ర సింగ్ ఆరు సార్లు ప్రమాణం చేశారు.
1983లో తొలిసారి సీఎం అయ్యారు
అనంతరం 1985, 1993, 1998, 2003, 2012లో సీఎం బాధ్యతల్ని నిర్వర్తించారు.

జయలలిత..
తమిళనాడు దివంగత నేత జయలలిత కూడా 6 సార్లు సీఎం అయ్యారు.
1991లో తొలిసారి సీఎం అయ్యారు.
2001, 2002, 2011, 2015, 2016లో తమిళనాడు సీఎంగా వ్యవహరించారు.

పవన్ కుమార్ చామ్లింగ్..
సిక్కింకు చెందిన పవన్ కుమార్ చామ్లింగ్ వరుసగా 5 సార్లు సీఎంగా ఉన్నారు.
1994లో తొలిసారి సీఎంగా బాధ్యతలు చేపట్టారు.
1999, 2004, 2009, 2014లో ముఖ్యమంత్రిగా ఉన్నారు.

జ్యోతిబసు..
పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం జ్యోతిబసు ఐదుసార్లు సీఎంగా ఉన్నారు
1977 నుండి 2000 వరకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు.
కేవలం ఐదుసార్లు మాత్రమే ప్రమాణ స్వీకారం చేశారు.

గెగాంగ్ అపాంగ్…
అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి గెగాంగ్ అపాంగ్ 5 సార్లు సీఎంగా ప్రమాణం చేశారు.
1980లో తొలిసారి సీఎం అయ్యారు.
1985, 1990, 1995, 2004లో ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు.

నవీన్ పట్నాయక్..
ఒడిశా ప్రస్తుత ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఐదుసార్లు ముఖ్యమంత్రి అయ్యారు.
తొలిసారి 2000లో సీఎం అయ్యారు.
అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆయనే సీఎంగా కొనసాగుతూ ఉన్నారు.

ఇక నితీష్ ఎప్పుడెప్పుడు సీఎంగా ప్రమాణం చేశారంటే.

మొదటిసారి – మార్చి 3, 2000
రెండవసారి- నవంబర్ 24, 2005
మూడవసారి- నవంబర్ 26, 2010
నాల్గవసారి- ఫిబ్రవరి 22, 2015
5వ సారి- నవంబర్ 20, 2015
ఆరవసారి- జూలై 27, 2017
7వ సారి- నవంబర్ 16, 2020
8వ సారి- ఆగస్టు 9, 2022
9వ సారి- జనవరి 28, 2024న సీఎంగా నితీష్ ప్రమాణం చేయనున్నారు.