Site icon NTV Telugu

Nitish Kumar: నితీష్ కుమార్ ప్రధాన మంత్రి అవుతారు.. జేడీయూ నేత కీలక వ్యాఖ్యలు..

Nitish Kumar

Nitish Kumar

Nitish Kumar: బీజేపీని ఓడించేందుకు 2024లో కాంగ్రెస్, జేడీయూ, ఆప్, టీఎంసీ, ఆర్జేడీ వంటి పార్టీలు కూటమి కట్టాయి. అయితే ఇప్పటి వరకు ఉమ్మడి ప్రధాని అభ్యర్థి ఎవరనేది ప్రకటించలేదు. ప్రధాని పదవిపై చాలా మంది నేతల గురి ఉంది. మమతాబెనర్జీ, నితీష్ కుమార్, రాహుల్ గాంధీ ఇలా పలువురు నాయకులు ప్రధాని పదవికి అర్హులని ఆయా పార్టీల నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా నితీష్ కుమార్ ప్రధాని అవుతారని ఆయన పార్టీ జేడీయూకు చెందిన నేత కీలక వ్యాఖ్యలు చేశారు.

Read Also: Khalistan: దెబ్బ అదుర్స్.. 19 మంది ఖలిస్తాన్ ఉగ్రవాదుల ఆస్తులు స్వాధీనం..

బీహార్ అసెంబ్లీ స్పీకర్, జేడీయూ నేత మహేశ్వర్ హజారీ ఆదివారం ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రధాని అభ్యర్థిగా ఎదగడానికి నితీష్ కుమార్ ను మించిన సమర్థుదైన నాయకుడు మరొకరు లేరని, దీనిపై ఇండియా కూటమి నేతలు భవిష్యత్తులో ప్రకటన చేయాలని సూచించారు. ప్రధానికి కావాల్సిన అన్ని అర్హతలు, లక్షణాలు నితీష్ కుమార్ కు ఉన్నాయని ాయన అన్నారు. ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థి పేరును ప్రకటిస్తే అది నితీష్ కుమార్ పేరే అవుతుందని ఆయన అన్నారు.

దేశంలో రామ్‌మనోహర్‌ లోహియా తర్వాత మహోన్నతమైన సోషలిస్టు నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది నితీష్‌ కుమార్‌ జీ అని ప్రధాని నరేంద్ర మోదీ ఎప్పుడో వ్యాఖ్యానించారని, నితీష్ కుమార్ 5 సార్లు కేంద్రంలో మంత్రిగా 18 ఏళ్లుగా బీహార్ ముఖ్యమంత్రిగా పనిచేశారని జేడీయూ నేత చెప్పారు. 2024 లోకసభ ఎన్నికలకుముందు పార్టీ సన్నద్ధత గురించి అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు.

Exit mobile version