NTV Telugu Site icon

Nitish Kumar: తాగితే చస్తారు.. మద్యం మరణాలపై సీఎం నితీష్‌ ఘాటు వ్యాఖ్యలు

Nitish Kumar On Liquor

Nitish Kumar On Liquor

Nitish Kumar: కల్తీ మద్యం తాగి పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయిన ఘటన ప్రస్తుతం బిహార్‌ రాజకీయాలను వణికిస్తోంది. ఈ ఘటనపై స్పందించిన ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్ మద్యం తాగితే చచ్చిపోతారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. బాధిత కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేసిన నేపథ్యంలో సీఎం నితీష్ తీవ్రంగా స్పందించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వారికి పరిహారం ఇచ్చే ప్రసక్తే లేదని ఆయన తేల్చిచెప్పారు. మద్యం తాగితే చస్తారని ఘాటుగా వ్యాఖ్యానించిన ముఖ్యమంత్రి నితీష్‌కుమార్.. ప్రజలు ఈ విషయంపై మరింత అప్రమత్తంగా ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. రాష్ట్రంలో 2016 నుంచి మద్యనిషేధం అమల్లో ఉన్న విషయాన్ని నితీష్ కుమార్‌ గుర్తుచేశారు.

ఇటీవల సరన్‌ జిల్లాలో కల్తీ మద్యం తాగి 30 మందికి పైగా మరణించగా.. జేడీయూ-ఆర్జేడీ ప్రభుత్వం నిషేధాన్ని అమలు చేయడంలో అలసత్వం వహించిందని బీజేపీ అసెంబ్లీలో, వెలుపల నిరసనలు చేపడుతోంది. ”కల్తీ మద్యం తాగిన వారు గతంలోనూ చాలా మంది చనిపోయారు. బాధిత కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని అడుగుతున్నారు. మద్యం తాగిన వారు ఖచ్చితంగా చనిపోతారు. ఇందుకు మన కళ్లముందున్న ఘటనే సాక్ష్యమని” నితీష్‌కుమార్ వ్యాఖ్యానించారు. ఇలాంటి ఘటనలు చాలా బాధాకరమని.. బాధిత ప్రాంతాలకు వెళ్లి ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఈ విషయంలో భారీ సామాజిక అవగాహన డ్రైవ్‌లను నడుపుతున్నామని నితీష్‌ పేర్కొన్నారు. కల్తీ మద్యంతో ప్రజలు చనిపోతున్నారని ఆయన వాదించారు. నిషేధిత రాష్ట్రమైన గుజరాత్‌, పంజాబ్‌లో ఇటీవలి సంవత్సరాలలో ఇలాంటి మరణాలు సంభవించాయి.

Komatireddy Venkat Reddy: ప్రధానితో భేటీ కానున్న కోమటిరెడ్డి వెంకట్.. కారణమిదీ!

మరణాలకు కారణమైన వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని మంత్రి సునీల్ కుమార్ తెలిపారు. ప్రస్తుతం నిషేధం ఉన్న రెండు పెద్ద రాష్ట్రాల్లో బీహార్ ఒకటి. మరొకటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సొంత రాష్ట్రం గుజరాత్. నాగాలాండ్, మిజోరం కొన్ని మినహాయింపులతో ఒకే విధమైన విధానాలను కలిగి ఉన్నాయి. దశాబ్దాలుగా, దక్షిణాదిలోని కేరళ, ఉత్తరాన హర్యానా వంటి రాష్ట్రాలు ఈ విధానాన్ని ప్రయత్నించాయి. అయితే అమలు చేయడం కష్టంగా ఉన్నందున ఎక్కువగా దానిని ఎత్తివేయవలసి వచ్చింది. మరోవైపు కల్తీ మద్యం ఘటనపై ముఖ్యమంత్రి బహిరంగ క్షమాపణ చెప్పాలని, బాధితులకు పరిహారం అందించాలన్న డిమాండ్‌ పెరుగుతోంది. ఇదే విషయంపై అసెంబ్లీలో బుధవారం నాడు విపక్షాలు చేసిన నిరసనలపై మండిపడ్డ సీఎం నితీష్ .. ‘తాగి సభకు వచ్చారా..?’ అని విపక్షాలపై విరుచుకుపడిన విషయం విదితమే.