NTV Telugu Site icon

Nitin Gadkari: నితిన్ గడ్కరీకి అస్వస్థత.. స్టేజ్ పై ఉండగానే కుప్పకూలిన కేంద్రమంత్రి

Nitin Gadkari

Nitin Gadkari

Nitin Gadkari: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఉత్తర బెంగాల్ పర్యటనలో ఉన్న మంత్రి స్టేజ్ పైనే శరీరంలో చక్కెర శాతం పడిపోవడంతో కాస్త ఇబ్బంది పడ్డారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు ఆయనను పక్కన ఉన్న గ్రీన్ రూమ్ లోకి విశ్రాంతి కోసం తీసుకెళ్లారు. వెంటనే ప్రథమ చికిత్స అందించారు. అనంతరం సిలిగురి నుంచి సీనియర్ డాక్టరును పిలిపించారు. డాక్టర్ చికిత్స ప్రారంభించి సెలైన్ ఎక్కించారు.

Read Also: Nisith Pramanik : మంత్రి వర్గంలో చిన్నవాడు.. కానీ దొంగతనంలో పెద్దవాడు

ఆయనకు బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గినట్టు డాక్టర్లు తెలిపారు. అనంతరం డార్జిలింగ్‌కు చెందిన బీజేపీ ఎంపీ రాజు బిస్తా నితిన్‌తో కలిసి కారులో తన ఇంటికి బయలుదేరారు. మతిగరలోని ఆయన స్వగృహంలో కేంద్రమంత్రికి చికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేయనున్నారు. వారి వెంట వైద్యులు కూడా ఉన్నారు. సిలిగురిలో వేడుక ముగిసిన తర్వాత, అతను దల్ఖోలాకు వెళ్లాల్సి ఉంది. రూ. 1,206 కోట్ల విలువైన మూడు నేషనల్ హైవే ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసేందుకు నితిన్ గడ్కరీ వెళ్లారు. అందుతున్ సమాచారాన్ని బట్టి మంత్రికి అనారోగ్యం కారణంగా ఈవెంట్ రద్దయ్యే అవకాశం ఉంది.

Read Also:Etela Rajender: తిరిగి టీఆర్‌ఎస్‌లోకి.. స్పందించిన ఈటల రాజేందర్‌

గడ్కరీ ఆరోగ్యంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వాకబు చేశారు. ఫోన్ చేసి వివరాలు కనుక్కున్నారు. పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా గడ్కరీ ఆరోగ్యంపై ఆరా తీశారు. సిలిగురిలో 1206 కోట్ల రూపాయలతో చేపట్టే జాతీయ రహదారుల ప్రాజెక్టులకు గడ్కరీ నేడు శంకుస్థాపన చేశారు. తీస్తా నదిపై 1100 కోట్ల రూపాయలతో త్వరలో వంతెన నిర్మిస్తామని కూడా గడ్కరీ హామీ ఇచ్చారు. రహదారుల నిర్మాణం కారణంగా సిక్కిం, డార్జిలింగ్, భూటాన్‌లకు కనెక్టివిటీ పెరుగుతుందని, ఈ ప్రాంతంలో మరింత అభివృద్ధికి అవకాశం ఏర్పడుతుందని గడ్కరీ చెప్పారు.