Lagaan Movie Art Director Nitin Chandrakant Desai Dead: ఇటీవల కాలంలో సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్.. ఇండస్ట్రీలకు చెందిన ప్రముఖులు మరణిస్తున్నారు. ఒకరి మరణ వార్తను మరిచిపోయే లోపే.. ఇంకొకరు కాలం చేస్తున్నారు. కొందరు అనారోగ్య, వయో సంబంధిత కారణాలతో చనిపోతుంటే.. మరికొంతంది ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. తాజాగా బాలీవుడ్ మూవీ ‘లగాన్’ ఆర్డ్ డైరెక్టర్ ఆత్మహత్య చేసుకున్నారు.
ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ నితిన్ చంద్రకాంత్ దేశాయ్ ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన వయసు 58 సంవత్సరాలు. కర్జాత్‌లోని తన ఎన్డీ స్టూడియోలో చంద్రకాంత్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆయన అకాల మరణం గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. చంద్రకాంత్ మరణంతో సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. బాలీవుడ్ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆయన కుటుంబానికి సంతాపం తెలుపుతున్నారు. లగాన్ హీరో అమిర్ ఖాన్.. చంద్రకాంత్ పార్థివ దేహాన్ని చూడడనికి వెళుతారని సమాచారం.
Also Read: Beer Tanning: ‘బీర్ టానింగ్’ ట్రెండ్ అంటే ఏంటి.. వద్దంటూ నిపుణులు ఎందుకు హెచ్చరిస్తున్నారు?
ఆర్ట్ డైరెక్టర్, ప్రొడక్షన్ డిజైనర్‌గా 20 ఏళ్ల పాటు సినీ ఇండస్ట్రీలో నితిన్ చంద్రకాంత్ దేశాయ్ పని చేశారు. అశుతోష్ గోవారికర్, విధు వినోద్ చోప్రా, రాజ్ కుమార్ హిరానీ, సంజయ్ లీలా బన్సాలీ వంటి ప్రముఖ దర్శకులతో ఆయన పని చేశారు. 1942: ఏ లవ్ స్టోరీ, హమ్ దిల్ దే చుకే సనమ్, దేవదాస్, లగాన్, వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ ముంబై, స్లమ్‌డాగ్ మిలియనీర్ వంటి బాలీవుడ్ హిట్ సినిమాలకు చంద్రకాంత్ పని చేశారు.
నితిన్ చంద్రకాంత్ దేశాయ్ చివరిగా అశుతోష్ గోవారికర్ దర్శకత్వం వహించిన ‘పానిపట్’ సినిమాకు పని చేశారు. ఈ సినిమా 2019లో విడుదలైంది. చంద్రకాంత్ ప్రస్తుతం ‘మహారాణా ప్రతాప్’ అనే వెబ్ సిరీసుతో బిజీగా ఉన్నారు. ఇది ఓటీటీలో విడుదలయ్యేందుకు సిద్దంగా ఉంది. ఇక 2005లో కర్జాత్‌లో 52 ఎకరాల్లో ఎన్డీ స్టూడియోను స్థాపించారు. ఈ స్టూడియోలో జోధా అక్బర్, ట్రాఫిక్ సిగ్నల్ లాంటి సినిమాలు మరియు రియాలిటీ షో బిగ్ బాస్ వంటి ఎన్నో షోలు షూటింగ్ జరుపుకున్నాయి.
Also Read: WI vs IND 3rd ODI: వెస్టిండీస్‌పై భారీ విజయం.. ప్రపంచంలోనే ఏకైక జట్టుగా భారత్!