NTV Telugu Site icon

Nithin : ఈ సారి కాస్త కొత్తగా ట్రై చేయబోతున్న నితిన్..?

Whatsapp Image 2023 06 12 At 8.33.05 Am

Whatsapp Image 2023 06 12 At 8.33.05 Am

యంగ్ స్టార్ నితిన్ హిట్ ను అందుకొని చాలా రోజులు అవుతుందని చెప్పాలి.ఈయన భీష్మ సినిమా తర్వాత ఆ స్థాయి హిట్ ను ఇప్పటి వరకు అయితే అందుకోలేక పోయాడు..ఈ మధ్యలో రెండు మూడు సినిమాలు చేసిన తనకు ఆశించిన ఫలితం మాత్రం ఇవ్వలేక పోయాయి.మరి అందుకే ఈసారి తనకు బీష్మ వంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన సక్సెస్ ఫుల్ దర్శకుడు తోనే మరో సినిమా కు చేస్తున్నాడని తెలుస్తుంది.నితిన్ హీరో గా వెంకీ కుడుముల డైరెక్షన్ లో భీష్మ సినిమా వచ్చింది.మరి ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన హీరోయిన్ గా నటించ గా అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఇప్పుడు ఈ ముగ్గురు కాంబో లోనే మళ్ళీ రిపీట్ అవుతుంది. ఈ ముగ్గురు కాంబినేషన్ లో మరో సినిమా రాబోతుంది. ”VNRTrio” అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా మరోసారి కూడా ఫుల్ ఫన్ అండ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోందని సమాచారం..

ఛలో మరియు భీష్మ సినిమాలు లాగా వెంకీ ఇదే జోనర్ లో మళ్ళీ ట్రై చేస్తాడు అనుకుంటే ఈసారి కొంత భిన్నంగా ట్రై చేయనున్నట్టు సమాచారం.ఈసారి భిన్నంగా అడ్వెంచరస్ గా సాగుతుందని సమాచారం… ఫన్ మాత్రమే కాదు అడ్వెంచరస్ కూడా అని తెలియడంతో ఈ సినిమాపై బాగా అంచనాలు పెరిగిపోయాయి.. ఫన్ అండ్ అడ్వెంచరస్ కాంబో మనం అర్ధం చేసుకోవచ్చు.ఇలాంటి కాంబోలో వచ్చిన సినిమాలన్నీ కూడా సూపర్ హిట్ గా నిలిచాయి. మరి ఈసారి కూడా వెంకీ – నితిన్ కాంబోలో సినిమా అదిరిపోతోంది అని ఫ్యాన్స్ కూడా భావిస్తున్నారు.ఇదిలా ఉండగా ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా జివి ప్రకాష్ సంగీతం అందిస్తున్నారని తెలుస్తుంది..మరీ ఈ సినిమాతో నితిన్ కెరీర్ మళ్ళీ ఫుల్ స్పీడ్ లో దూసుకెళ్తుందో లేదో మరీ చూడాలి.

Show comments