Nithin : నాకు ఆ మూవీ బాగా నచ్చింది.. కానీ ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ నటించిన లేటెస్ట్ మూవీ ‘ఎక్స్‌ట్రా – ఆర్జినరీ మ్యాన్’ ఈ మూవీలో నితిన్ సరసన శ్రీలీల హీరోయిన్‍గా నటించారు. ఈ సినిమాకు వక్కంతం వంశీ దర్శకత్వం వహించారు. ఎన్నో సూపర్ హిట్ సినిమాకు కథలు అందించిన వంశీకి దర్శకుడిగా ఇది రెండో మూవీ. అయితే రీసెంట్ గా ఎక్స్‌ట్రా – ఆర్డినరీ మ్యాన్ ట్రైలర్ రిలీజ్ అయింది.ఈ మూవీ ట్రైలర్ ఫుల్ ఎంటర్‌టైన్‍మెంట్‍తో సాగింది.ఈ మూవీ డిసెంబర్ 8వ తేదీన గ్రాండ్ గా థియేటర్లలో రిలీజ్ కానుంది.తాజాగా ఈ చిత్రం నుంచి “ఓలే ఓలే పాపాయి” పాట ప్రోమో నేడు విడుదల అయింది.. ఈ సాంగ్ ప్రోమో లాంచ్ ఈవెంట్‍కు హీరో నితిన్ హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ..తాను చేసిన సినిమాల్లో ఇష్టమైనది ఏదనే ప్రశ్న నితిన్‍కు ఎదురైంది. దీనికి ఆయన సమాధానం చెప్పారు. శ్రీఆంజనేయం సినిమా తనకు ఎంతో ఇష్టమని నితిన్ చెప్పారు. అయితే, ఆ మూవీ ఆశించిన స్థాయిలో విజయం సాదించలేదని తెలిపారు.కానీ ఇప్పుడున్న గ్రాఫిక్స్‌తో ఆ చిత్రం తెరకెక్కిస్తే చాలా పెద్ద హిట్ అవుతుందని చెప్పారు.
ప్రస్తుతం నేను మాలలో ఉన్నానని కాదు కానీ నాకు చాలా ఇష్టమైన సినిమా శ్రీఆంజనేయం. ఆ సినిమా చిన్నచిన్న లోపాల వల్ల ఆశించిన స్థాయిలో హిట్ కాలేదు. ప్రస్తుతం వున్న సీజీ వర్క్ లాంటి వాటితో ఆ సినిమా రీమేక్ చేస్తే చాలా పెద్ద రేంజ్ మూవీ అవుతుంది. నేను మళ్లీ అలాంటి ఒక అమాయకపు క్యారెక్టర్ చేస్తే బాగుంటుందని నా ఫీలింగ్” అని నితిన్ చెప్పారు. నితిన్ ప్రస్తుతం అంజనేయ మాల ధరించారు. కాగా, కృష్ణ వంశీ దర్శకత్వంలో నితిన్ హీరోగా నటించిన శ్రీఆంజనేయం మూవీ 2004లో రిలీజ్ అయింది. అయితే, ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైంది. ఈ చిత్రంలో ఆంజనేయుడిగా యాక్షన్ కింగ్ అర్జున్ నటించారు.ఇక హీరోయిన్ శ్రీలీల గురించి మాట్లాడుతూ.. శ్రీలీల డేట్స్ దొరకడం తమకు ఛాలెంజింగ్‍గా ఉందని నితిన్ అన్నారు. ఆమె ప్రమోషన్లకు వస్తుందా లేదా అన్న టెన్షన్ కూడా ఉందని తెలిపారు.మాస్ బీట్‍తో ఉన్న “ఓలే ఓలే పాపాయి” సాంగ్ ప్రోమో అదిరిపోయింది. ఈ పాటలో నితిన్ శ్రీలీల మాస్ స్టెప్స్ తో ఆకట్టుకున్నారు. అయితే పూర్తి పాట డిసెంబర్ 4న విడుదల కానుంది.. ఈ చిత్రానికి హారిస్ జైరాజ్ అదిరిపోయే మ్యూజిక్ అందించారు.
Also Read
- Rahul Gandhi and PM Modi: నేడు రాహుల్.. రేపు మోడీ.. చెన్నైలో వరుస కీలక కార్యక్రమాలు
- AB de Villiers: 42 ఏళ్ల వయసులోనూ తగ్గని జోరు.. 37 బంతుల్లో ఏబీ డివిలియర్స్ విధ్వంసకర సెంచరీ..!
- How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
- CM Chandrababu: నియోజకవర్గాల స్థాయిలో విజన్ ప్లాన్లు.. అధికారులకు సీఎం దిశానిర్దేశం
తాజావార్తలు
-
Rahul Gandhi and PM Modi: నేడు రాహుల్.. రేపు మోడీ.. చెన్నైలో వరుస కీలక కార్యక్రమాలు
-
AB de Villiers: 42 ఏళ్ల వయసులోనూ తగ్గని జోరు.. 37 బంతుల్లో ఏబీ డివిలియర్స్ విధ్వంసకర సెంచరీ..!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
CM Chandrababu: నియోజకవర్గాల స్థాయిలో విజన్ ప్లాన్లు.. అధికారులకు సీఎం దిశానిర్దేశం
-
Election Commission: CTRL+ALT+Delete.. రాత్రికి రాత్రే వేలాది ఓట్లు గాయబ్..!
ట్రెండింగ్
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!