టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’.. ఈ సినిమాలో క్రేజీ బ్యూటి శ్రీలీల నితిన్ సరసన హీరోయిన్ గా నటించింది.ఈ సినిమాను రైటర్ కమ్ డైరెక్టర్ వక్కంతం వంశీ తెరకెక్కించారు. శ్రేష్ట్ మూవీస్, రుచిర ఎంటర్టైన్మెంట్స్ మరియు ఆదిత్య ఎంటర్టైన్మెంట్ మూవీస్ బ్యానర్ల మీద ఎన్ సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మించిన ఈ మూవీకి రాజ్ కుమార్ ఆకెళ్ల సమర్పకులుగా వ్యవహరించారు. ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ డిసెంబర్ 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సోమవారం (డిసెంబర్ 4) గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో హీరో నితిన్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. “ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమా నాకు ఎంతో స్పెషల్.ఇంత వరకు నేను ఇలాంటి కారెక్టర్ అస్సలు చేయలేదు. ఇలాంటి పాత్రను నాకు ఇచ్చిన దర్శకుడు వక్కంతం వంశీకి థాంక్స్. ఖ్యాతీ, రిత్విక్ పాత్రలతో మీరు ప్రేమలో పడతారు. ప్రతీ పాత్రకు ఇందులో చాలా ప్రాముఖ్యత ఉంటుంది” అని నితిన్ తెలిపారు.
యాంగ్రీ స్టార్ రాజశేఖర్ గారు చేసిన ‘మగాడు’ సినిమాతో మా నాన్న డిస్ట్రిబ్యూషన్ చేశారు. ఆ సినిమా సూపర్ హిట్ అయింది కాబట్టే మా నాన్న ఈ ఇండస్ట్రీలో ఉన్నారు. ఆయన ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టే నేను హీరోగా ఇండస్ట్రీ లో ఉన్నాను. ఇలా మళ్లీ మీరు నా సినిమాలో ఇలా స్పెషల్ రోల్ చేసినందుకు థాంక్స్..ఆయన లేకపోతే ఈ సినిమా లేదు. అలాగే హ్యారిస్ జైరాజ్ గారు మంచి మ్యూజిక్ అందించారు. మూవీ లో ఆర్ఆర్ చాలా కొత్తగా ఉంటుంది. డీఓపీ యువరాజ్‌తో నేను మూడు సినిమాలు చేశాను.ఆయనకు నన్ను ఎలా చూపించాలో బాగా తెలుసు అని నితిన్ చెప్పుకొచ్చాడు.శ్రీలీల ఎంత బిజీగా ఉన్నా కూడా మాకు అవసరమైనప్పుడు ఆమె డేట్స్ ఇచ్చారు. సినిమాలో నేను ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ కానీ.. రియల్ లైఫ్‌లో శ్రీలీల ఎక్స్‌ట్రా ఆర్డినరీ వుమెన్. నాకు, నా దర్శకుడికి ఈ సినిమా ఎంతో ముఖ్యం.. సినిమాను చూసి నా ఫ్యాన్స్ మరియు ప్రేక్షకులు అంంతా కాలర్ ఎగరేసుకుని థియేటర్ నుంచి బయటకు వస్తారు. డిసెంబర్ 8న గట్టిగా కొట్టబోతోన్నాం.సిద్ధంగా ఉండండి అని నితిన్ తెలిపారు.