NTV Telugu Site icon

Robinhood: స్టేజీపై విద్యార్థులతో రెచ్చిపోయిన నితిన్, శ్రీలీల.. వీడియో వైరల్

Robinhood

Robinhood

Robinhood: టాలీవుడ్ యంగ్ హీరో నితిన్, గ్లామరస్ బ్యూటీ శ్రీలీల జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘రాబిన్ హుడ్’ (Robinhood). టాలెంటెడ్ డైరెక్టర్ వెంకీ కుడుముల (Venky Kudumula) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, రవి శంకర్ కలిసి ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ చిత్రాన్ని మార్చి 28న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నారు. ‘రాబిన్ హుడ్’ సినిమా ప్రమోషన్స్ స్పీడ్‌గా కొనసాగుతున్న సమయంలో, ఇటీవల చిత్ర యూనిట్ స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ సంబంధించిన మాస్ లుక్‌ను విడుదల చేసింది. ఆయన లుక్ సినిమాపై మరింత క్యూరియాసిటీ పెంచింది. వార్నర్ ఇందులో ఎలా కనిపించబోతున్నారు? ఆయన పాత్ర ఏమిటనే విషయాలు అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచుతున్నాయి.

Read Also: NZ vs Pak: తీరుమారని పాకిస్తాన్.. మరోమారు ఘోర పరాజయం

ఇకపోతే ఈ సినిమా విడుదల తేదీ దగ్గరపడుతున్న తరుణంలో, మూవీ టీమ్ ప్రమోషన్ల జోరు పెంచింది. తాజాగా రాజమండ్రిలోని ఐఎస్‌టీఎస్ (ISTS) కాలేజీని సందర్శించి అక్కడి విద్యార్థులతో ముచ్చటించింది. ఈ కార్యక్రమంలో హీరో నితిన్, హీరోయిన్ శ్రీలీల స్టూడెంట్స్‌తో సరదాగా గడిపారు. ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా నితిన్, శ్రీలీల కలిసి ‘వేరెవర్ యూ గో’ అనే సాంగ్‌కు అదిరిపోయే స్టెప్పులు వేశారు. ఈ డాన్స్ వీడియోను మైత్రీ మూవీ మేకర్స్ తమ సోషల్ మీడియా ఖాతా ద్వారా షేర్ చేసింది ప్రస్తుతం ఆ వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ వీడియోలో హీరో నితిన్, గ్లామరస్ బ్యూటీ శ్రీలీల జంట విద్యార్థులతో కలిసి స్టేజి పై డాన్స్ చేసారు.

Read Also: Minister Amit Shah: చిన్నారి పాటకు మంత్రముగ్ధుడైన కేంద్ర హోంమంత్రి.. బహుమానంగా ఏమిచ్చారంటే?

ఇప్పటికే నితిన్, వెంకీ కుడుముల కాంబినేషన్‌లో వచ్చిన ‘భీష్మ’ సినిమా సూపర్ హిట్ కావడంతో, ‘రాబిన్ హుడ్’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాకి జీబ్రాన్ సంగీతం అందిస్తున్నారు. ఫన్, యాక్షన్, రొమాన్స్, మాస్ ఎలిమెంట్స్ అన్నీ పండించే విధంగా ఈ చిత్రాన్ని రూపొందించినట్లు సమాచారం. మొత్తానికి, ‘రాబిన్ హుడ్’ మూవీ ప్రమోషన్లతో టాలీవుడ్‌లో మంచి బజ్ క్రియేట్ చేస్తోంది. మార్చి 28న ఈ సినిమా ఎంతవరకు ప్రేక్షకులను మెప్పిస్తుందో చూడాలి మరి.