NTV Telugu Site icon

Nithiin’s Robinhood: సరికొత్త లుక్ లో నితిన్.. ఈసారి ఏదో గట్టిగానే ప్లాన్ చేసినట్టున్నాడే..!

11

11

హీరో నితిన్ పుట్టినరోజు సందర్భంగా తాజాగా తను నటించబోయే సినిమాకు సంబంధించిన స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేసింది మైత్రి మూవీ మేకర్స్. రాబిన్ ఫుడ్ గా హీరో నితిన్ ఈ సినిమాలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇదివరకు హీరో నితిన్ డైరెక్టర్ వెంకీ కుడుమల కాంబినేషన్లో ‘భీష్మ’ సినిమా రాగ అఖండ విజయాన్ని అందుకుంది. దానితో మరోసారి వీరిద్దరూ మైత్రి మూవీ మేకర్స్ ఆధ్వర్యంలో ఓ హాస్య యాక్షన్ అడ్వెంచర్ సినిమాను తెరకెక్కిస్తున్నారు. నేడు నితిన్ పుట్టినరోజు సందర్భంగా.. రాబిన్ హుడ్ మేకర్స్ సరికొత్త పోస్టర్ ను సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు.

Also read: Gunturu karam: వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ‘గుంటూరు కారం’ డేట్ ఫిక్స్..!

ఈ పోస్టర్ పరంగా చూస్తే.. రాబిన్ హోటల్ మేకర్స్ నితిన్ తో భారీగా ప్లాన్ చేసినట్టు కనబడుతోంది. ఫస్ట్ లుక్ పోస్టర్ లో ట్రెండి లుక్కుల్లో కనిపించాడు నితిన్. తాజాగా విడుదలైన రాబిన్ ఫుడ్ పోస్టర్ లో స్టైలిష్ గా నడుస్తూ.., బ్లూటూత్ లో మాట్లాడుతున్నట్టుగా హీరో నితిన్ కనిపిస్తున్నాడు. పోస్టర్ బట్టి చూస్తే.. హీరో నితిన్ ఏజెంట్ లాగా కనిపిస్తున్నాడు. దీనికి కారణం హీరో వేసుకున్న టీ షర్టుపై ఏజెంట్ RH గా రాసి ఉండడమే.

Also read: Tillu Square OTT: వామ్మో.. టిల్లు స్క్వేర్ ఓటీటీ అన్ని కోట్లకి అమ్ముడుపోయిందా..?!

ఈ సినిమాకి నవీన్ యెర్నేని మరియు వై రవి శంకర్ లు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇక ఈ సినిమాకు గాను జాతీయ అవార్డు గ్రహీత జీవి ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమాలో హీరో నితిన్ తో పాటు నటకిరీటి రాజేంద్రప్రసాద్, హాస్య నటుడు వెన్నెల కిషోర్ కీలకపాత్రలో నటిస్తున్నారు.

Show comments