Site icon NTV Telugu

Nithiin : సొంత నిర్మాణ సంస్థలో నితిన్ సినిమా.. దర్శకుడు ఎవరంటే

Nithiin

Nithiin

వరుస ఫ్లోప్స్ తో ఇబ్బంది పడుతున్నాడు యంగ్ హీరో నితిన్. ఎన్నో ఆశలు పెట్టుకున్న తమ్ముడు డిజాస్టర్ కావడంతో అప్పటికే కమిట్ అయిన సినిమాలను కూడా క్యాన్సిల్ చేసేసాడు నితిన్. లాంగ్ గ్యాప్ తీసుకుని కథలు వింటూ ఉన్నాడు. ఈ దశలో గోదావరి నేపథ్యంతో ‘ఆయ్’ సినిమాను హిలేరియస్ ఎంటర్‌టైనర్‌గా మలిచి విమర్శకుల ప్రశంసలు అందుకున్న అంజి తాజాగా నితిన్‌ను కలిసి ఒక కొత్త స్క్రిప్ట్‌ను వినిపించాడు. అంజి చెప్పిన పాయింట్ నచ్చడంతో నితిన్ వెంటనే ఓకే చెప్పినట్లు సమాచారం. ఈ చిత్రం కూడా మంచి వినోదాత్మక అంశాలతో కూడిన వినూత్న కథాంశంతో ఉండబోతోందట.

Also Read : Telugu Cinema : భగవంత్ కేసరి నిర్మాత బ్యానర్ లో ‘అల్లరి నరేష్ – నారా రోహిత్’ మల్టీస్టారర్

ఈ చిత్రాన్ని నితిన్ తన సొంత నిర్మాణ సంస్థ అయిన శ్రేష్ట్ మూవీస్ బ్యానర్‌లో నిర్మించనున్నారు. ‘ఆయ్’ వంటి సెన్సిబుల్ హిట్ ఇచ్చిన దర్శకుడితో సినిమా కావడం కథ కూడా బాగా నచ్చడంతో సొంత బ్యానర్ లోనే చేయాలనీ రెడీ అవుతున్నాడు.ప్రస్తుతం నితిన్ విఐ ఆనంద్ డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాడు. శ్రీనివాస్ చిట్టూరి నిర్మాతగా వస్తున్న ఈ సినిమా నితిన్ కెరీర్ లో 36వ సినిమాగా వస్తోంది. ఆ సినిమా ఫినిష్ చేసాక సొంత బ్యానర్ లో సినిమా స్టార్ట్ చేసేలా ప్లాన్ చేస్తున్నాడు నితిన్. భీష్మ తర్వాత హిట్ చూడని నితిన్ ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని ఎదురుచూస్తున్నాడు. విఐ ఆనంద్ మరియు అంజి ఈ ఇద్దరిలో ఎవరు నితిన్ కు కంబ్యాక్ హిట్ ఇస్తారో చూడాలి. 

Exit mobile version