Site icon NTV Telugu

Team Name Change: అంబానీల మాస్టర్ ప్లాన్ మాములుగా లేదుగా.. జట్టు పేరు మార్పు! అదే కారణమా?

Team Name Change

Team Name Change

Team Name Change: ముంబై ఇండియన్స్ యజమానురాలు నితా అంబానీ తన జట్టుకు సంబంధించి ఓ పెద్ద నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం. వచ్చే సీజన్‌ నుండి ఆమె జట్టు కొత్త పేరుతో మైదానంలోకి దిగనుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో జరుగుతున్న ది హండ్రెడ్ లీగ్ లో ‘ఓవల్ ఇన్విన్సిబుల్స్’ అద్భుత ప్రదర్శనతో 6లో 5 మ్యాచ్‌లు గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. అయినా కానీ 2026 సీజన్‌ నుండి ఈ జట్టుకు ‘ఓవల్ ఇన్విన్సిబుల్స్’ అనే పేరులో మార్పు కానున్నట్లు సమాచారం. ‘ఓవల్ ఇన్విన్సిబుల్స్’ ను కాస్త ‘ఎంఐ లండన్’ (MI London)గా మార్చనున్నట్లు నివేదికలు తెలుస్తున్నాయి.

Suicide Attempt: ప్రియుడి మోసం.. మూడో అంతస్తు నుంచి దూకేసిన ప్రియురాలు.. చివరకు?

ఇంగ్లాండ్‌లో జరుగుతున్న ద హండ్రెడ్ లీగ్లో ఓవల్ ఇన్విన్సిబుల్స్‌ జట్టులో రిలయన్స్ కంపెనీకి 49% వాటా ఉంది. అంబానీ కుటుంబం MI బ్రాండ్ ను గ్లోబల్ స్థాయిలో బలంగా ప్రోత్సహించాలని ఆలోచనలో భాగంగా.. జట్టు పేరు ‘MI లండన్’గా మార్చాలని నిర్ణయించింది. ECB (ఇంగ్లాండ్ అండ్ వెల్స్ క్రికెట్ బోర్డ్) నియమాల ప్రకారం ద హండ్రెడ్ లో కౌంటీ పేర్లను ఉపయోగించరాదు కాబట్టి పేరుమార్పుకు ఎలాంటి అడ్డంకి ఉండదని తెలుస్తోంది. ఓవల్ ఇన్విన్సిబుల్స్ పేరు మారిన తర్వాత, ఇది అంబానీ కుటుంబం ఆధ్వర్యంలోని జట్ల జాబితాలో చేరుతుంది. ఇప్పటికే MI కేప్ టౌన్, ముంబై ఇండియన్స్ (IPL), WPL ముంబై ఇండియన్స్, MI న్యూయార్క్, MI ఎమిరేట్స్ వంటి జట్లు అనేక లీగ్స్ లో వారి జట్లు రానిస్తున్నాయి. ఇప్పుడు MI లండన్ కూడా ఈ గ్లోబల్ బ్రాండ్‌లో భాగం కానుంది.

Parliament: పార్లమెంట్‌ దగ్గర దుండగుడు కలకలం.. గోడ దూకి హల్‌చల్

ప్రస్తుతం ద హండ్రెడ్ లీగ్ లో ‘ఓవల్ ఇన్విన్సిబుల్స్’ అద్భుత ఫామ్‌లో కొనసాగుతోంది. ఇటీవల ట్రెంట్ రాకెట్స్‌పై జరిగిన మ్యాచ్‌లో జోర్డాన్ కాక్స్, సామ్ కరన్‌ల మెరుపు బ్యాటింగ్‌తో జట్టు 11 బంతులు మిగిలి ఉండగానే 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. సామ్ బిల్లింగ్స్ సారధ్యంలో ఈ జట్టు ఇప్పటికే 6లో 5 మ్యాచ్‌లు గెలిచి పాయింట్స్ టేబుల్ టాప్‌లో ఉంది.

Exit mobile version