Site icon NTV Telugu

Nishant Kumar: జేడీయూలో చేరిన సీఎం నితీష్ కుమార్ తనయుడు..

Nitish Kumar

Nitish Kumar

Nishant Kumar: బీహార్‌లో కీలక రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. జేడీయూ అధినేత, సీఎం నితీష్ కుమార్ తనయుడు నిశాంత్ కుమార్ పార్టీలో చేరారు. ఆదివారం 50 ఏళ్ల నిశాంత్ కుమార్ ఈ రోజు అధికారికంగా జేడీయూలో చేరారు. రెండు దశాబ్ధాలకు పైగా బీహార్ రాజకీయాలను శాసిస్తున్న నితీష్ కుమార్ ముఖ్యమంత్రి పదవికి త్వరలో రాజీనామా చేయబోతున్నారు. మార్చి 16న రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు నామినేషన్ పత్రాలు కూడా దాఖలు చేశారు. దీని తర్వాత ఆయన సీఎం పదవిని వదులుకోనున్నారు. మరోవైపు, బీహార్ రాష్ట్రానికి బీజేపీ నేత ముఖ్యమంత్రి కాబోతున్నారు. ఈ నేపథ్యంలో నిశాంత్ కుమార్‌ను డిప్యూటీ సీఎంగా చేసే అవకాశం ఉన్నట్లు వార్తలు వెలువడుతున్నాయి.

Exit mobile version