NTV Telugu Site icon

Budget 2024 : బడ్జెట్‎కు కేంద్ర కేబినెట్ ఆమోదం..కాసేపట్లో ప్రవేశపెట్టనున్న నిర్మలా సీతారామన్

New Project 2024 07 23t104850.743

New Project 2024 07 23t104850.743

Budget 2024 : ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు పార్లమెంట్‌లో పూర్తి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఆమె బడ్జెట్ ప్రసంగం ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతుంది. బడ్జెట్‌ సమర్పణకు ముందు కేంద్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. సమావేశంలో బడ్జెట్‌కు ఆమోదం తెలిపారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఉదయం 11 గంటలకు లోక్‌సభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈసారి కూడా పేపర్‌లెస్ బడ్జెట్ ప్రవేశపెట్టానున్నారు. వికసిత్ భారత్ లక్ష్యంగా ఈ సారి కేంద్ర బడ్జెట్ ఉండనుంది.

Read Also:IAS Officer Wife: గ్యాంగ్‌స్టర్‌తో లేచిపోయిన ఐఏఎస్‌ అధికారి పెళ్ళాం.. చివరికి ఏమైందంటే..?

బడ్జెట్‌లో పన్ను శ్లాబ్‌లో మార్పు
మోడీ మూడో టర్న్ ఐదు సంవత్సరాల రోడ్‌మ్యాప్ ఈ బడ్జెట్‌లో ఉంటుందని భావిస్తున్నారు. అభివృద్ధి చెందిన భారత్ వ్యూహం కూడా ఇందులో వెల్లడవుతుంది. ఆర్థిక వ్యవస్థకు బూస్ట్ ఇచ్చేందుకు పటిష్టమైన చర్యలు తీసుకోవచ్చు. దీంతో పాటు ఉపాధిని పెంచేందుకు కొత్త నిర్ణయాలు తీసుకోనున్నారు. గ్రీన్ ఎకానమీకి ప్రాధాన్యత ఇవ్వవచ్చు. ఈ బడ్జెట్‌లో పన్ను శ్లాబులలో కూడా మార్పులు వస్తాయని భావిస్తున్నారు. స్టాండర్డ్ డిడక్షన్ పరిమితిని రూ.50 లక్షల నుంచి పెంచాలని భావిస్తున్నారు. కొత్త ఫ్యాక్టరీలు, కొత్త పెట్టుబడులపై తక్కువ కార్పొరేట్ పన్ను ఎంపిక అందుబాటులో ఉంటుంది. పీఎం స్వానిధి యోజన పరిధి విస్తరించనున్నారు.

Read Also:Gold Price Today: నేడు భారీగా తగ్గిన బంగారం ధరలు.. వారం రోజుల్లో ఐదోసారి!