NTV Telugu Site icon

Nirmala Sitaraman: కూరగాయల మార్కెట్లో కేంద్ర మంత్రి.. జీఎస్టీ వేస్తారేమోనంటూ కామెంట్లు

Nirmala

Nirmala

Nirmala Sitaraman: కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ మార్కెట్ కు వెళ్లి కూరగాయలు కొన్న వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దేశంలో ద్రవ్యోల్బణం పెరుగుతున్న వేళ… ప్రజలకు నిత్యావసర సరుకులైన కూరగాయలపై కేంద్రమంత్రి దృష్టి పెట్టినట్లున్నారని కొంతమంది అంటుండగా… నిత్యావసరాల సరుకుల ధరలు పెరుగుతున్నాయా లేదా అని తెలుసుకునేందుకు నిర్మలా సీతారామన్ మార్కెట్ కు వెళ్లినట్లున్నారని మరి కొంతమంది కామెంట్ చేస్తున్నారు.

ఓ కేంద్ర మంత్రి స్వయంగా కూరగాయలు కొనేందుకు మార్కెట్ రావడంతో స్థానికులు ఆమెతో మాట్లాడేందుకు ఎగబడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోను నిర్మలా సీతారామన్ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. ఇవి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. శనివారం ఆమె తమిళనాడు రాజధాని చెన్నైకు వెళ్లారు. చెన్నైకు చేరుకున్న ఆమె అక్కడ మైలాపూర్ ప్రాంతంలో కూరగాయల మార్కెట్‌కు వెళ్లి.. పలు రకాల కూరగాలను కొనుగోలు చేశారు. కూరగాయల ధరల వివరాలను తెలుసుకుని, ఆమె స్వయంగా కూరగాయలు ఎలా ఉన్నాయో పరిశీలించి మరీ వాటిని కొనుగోలు చేశారు.
అనంతరం నిర్మలా సీతారామన్ అక్కడే ఉన్న కూరగాయల వ్యాపారులతో, స్థానిక ప్రజలతో మాట్లాడారు. నిజానికి ధరల పెరుగుదల విషయంలో ఆర్థిక మంత్రిని, కేంద్రాన్ని ప్రతిపక్షాల నేతలు విమర్శిస్తున్నారు.

Read Also: MBBS in Hindi: స్టూడెంట్స్‎కు గుడ్ న్యూస్.. హిందీలోనూ ఎంబీబీఎస్ కోర్స్ చదివే అవకాశం

మరోవైపు సోషల్ మీడియాలో నిర్మలా సీతారామన్ పోస్టులకు మిశ్రమ స్పందన వస్తోంది. పెరిగిన ధరలను తెలుసుకునేందుకు వెళ్లినందుకు ధన్యవాదాలు అంటూ కొందరు కామెంట్లు పెడుతుండగా.. ఓ ఆర్థిక మంత్రే ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్‌లను ఉపయోగించడం ఏమిటని కొందరు ప్రశ్నిస్తున్నారు. అన్నింటి పైనా జీఎస్టీ పేరుతో అధిక ధరలు వసూలు చేస్తూ బాదుతున్న కేంద్ర ఆర్దిక శాఖ..ఇప్పుడు కూరగాయల పైనా జీఎస్టీ విధిస్తారా అంటూ ప్రశ్నిస్తున్నారు. కొద్ది నెలల క్రితం కొన్ని ఆహార పదార్దాల పై జీఎస్టి విధించిటం..తరువాత నిర్ణయంలో మార్పులు చేయటం పెద్ద ఎత్తున చర్చకు కారణమైంది.