Nirmala Sitharaman Saree: ప్రతి ఏడాది ప్రవేశ పెట్టే కేంద్ర బడ్జెట్ అంటే ఆర్థిక కేటాయింపులు, సంస్కరణలపైనే కాదు.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ధరించే చీరలపైనా దేశవ్యాప్తంగా ప్రత్యేక ఆసక్తి నెలకొంది. భారతీయ సంస్కృతి, సంప్రదాయాల్ని ప్రతిబింబించేలా ఆమె ఎంచుకునే చేనేత చీరలు ఎంతో మంది మహిళలకు మార్గదర్శకంగా నిలుస్తున్నాయి. ఇక, ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచే నిర్మలా సీతారామన్ ఎక్కువగా దేశీయ చేనేత చీరలకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ముఖ్యంగా బడ్జెట్ రోజున ఆమె ధరించే చీరకు ఏదో ఒక స్పెషల్ ఉండేలా చూసుకుంటారు.
Read Also: Gold and silver prices: కేంద్ర బడ్జెట్ ముందు పడిపోయిన బంగారం,వెండి రేట్లు..
బడ్జెట్ 2026-27లో ఏ చీర ధరించారంటే?:
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ ఉదయం 11 గంటలకు బడ్జెట్ 2026-27ను ప్రవేశ పెట్టబోతున్నారు. ఈ సందర్భంగా గత సంప్రదాయాన్ని కొనసాగిస్తూ భారతీయ సంస్కృతి కనిపించేలా చేతితో ప్రత్యేకంగా నేసిన కాంచీవరం పట్టు చీరను ఆమె ధరించారు. అయితే, తమిళనాడు పురాతన చేనేత వారసత్వాన్ని గౌరవిస్తూ ఎంపిక చేసిన ఈ చీరలో లేత బంగారు గోధుమ రంగు గడులు, కాఫీ బ్రౌన్ అంచు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఈ సంవత్సరం తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆమె తమిళనాడు చేనేత చీరను ధరించడం రాజకీయంగా ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా, 2019లో రెండోసారి ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి ప్రతి బడ్జెట్ సందర్భంగా నిర్మలా వివిధ రాష్ట్రాల సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే చీరలను కట్టుకున్నారు.
Read Also: Rishab Shetty: పారితోషికం విషయంలో ససేమిరా అంటున్న రిషబ్ శెట్టి .. టాలీవుడ్ నిర్మాతల డైలమా!
గత బడ్జెట్లలో నిర్మలమ్మ ధరించిన చీరలు:
* 2019: తొలి బడ్జెట్ సందర్భంగా మంగళగిరి గులాబీ రంగు చీర..
* 2020: ‘ఆస్పిరేషనల్ ఇండియా’ ఇతివృత్తంతో రూపొందించిన నీలం అంచు గల పసుపు- బంగారు రంగు చీర..
* 2021: రెడ్–బ్రౌన్ కలయికతో ఉన్న భూదాన్ పోచంపల్లి చీర..
* 2022: ఒడిశాకు చెందిన మెరూన్ కలర్ చేనేత చీర..
* 2023: ఎరుపు రంగు, టెంపుల్ అంచుతో ఉన్న చీర..
* 2024 ఫిబ్రవరి 1 ( ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ): నీలం రంగు చేనేత చీర- బెంగాలీ సంస్కృతి ప్రతిబింబించేలా బ్రౌన్ ఎంబ్రాయిడరీతో.. అయోధ్య బాల రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠకు ప్రతీకగా దీన్ని ధరించినట్లు వెల్లడించింది.
* 2024 (మధ్యంతర బడ్జెట్): తెలుపు రంగు, గోల్డ్ మోటిఫ్స్‌తో మెజెంటా అంచు ఉన్న సిల్క్ చేనేత చీర..
* 2025: బంగారు అంచుతో ఉన్న క్రీమ్ కలర్ చేనేత చీర- బీహార్ రాష్ట్ర మధుబని కళా చిత్రాలతో ప్రత్యేకంగా రూపొందించారు.
* 2026: చేతితో ప్రత్యేకంగా నేసిన కాంచీవరం పట్టు చీర.. ఈ చీరలో లేత బంగారు గోధుమ రంగు గడులు, కాఫీ బ్రౌన్ అంచు ప్రత్యేక ఆకర్షణ
Read Also: Karthi ‘హిట్-4’పై కీలక అప్‌డేట్..!
చేనేతకు వేదికగా బడ్జెట్:
అయితే, బడ్జెట్ వేదికను ఉపయోగించి దేశవ్యాప్తంగా ఉన్న చేనేత కళాకారులకు గుర్తింపు తీసుకురావడమే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రత్యేకత. ఆమె ధరించే ప్రతి చీర వెనుక ఓ రాష్ట్ర సంస్కృతి, ఓ సంప్రదాయం దాగి ఉంటుంది. అందుకే బడ్జెట్ రోజు ఆమె చీరలు కేవలం దుస్తులే కాదు.. భారతీయ వారసత్వానికి ప్రతీకలుగా నిలుస్తున్నాయి.
