Nipah Outbreak: రాష్ట్రానికి బిగ్ రిలీఫ్.. నిఫా వైరస్‌పై కేరళ ప్రభుత్వం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nipah Outbreak: కేరళలో తాజా నిఫా వైరస్ వ్యాప్తికి సంబంధించి పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని, హైరిస్క్ కాంటాక్ట్‌ల నుంచి 200 కంటే ఎక్కువ నమూనాలను పరీక్షించగా నెగెటివ్ అని వచ్చిందని కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ సోమవారం కేరళలో తెలిపారు. ఇప్పటివరకు 1,233 కాంటాక్టులను గుర్తించామని, అందులో అధిక రిస్క్, తక్కువ రిస్క్ కాంటాక్టులుగా వర్గీకరించామని చెప్పారు. చాలా సానుకూల విషయం ఏమిటంటే, చికిత్సలో ఉన్న నలుగురు రోగులు ఇప్పుడు నిలకడగా ఉన్నారని ఆమె తెలిపారు. వెంటిలేటర్ సపోర్ట్‌లో ఉన్న తొమ్మిదేళ్ల బాలుడి పరిస్థితి వైద్యపరంగా మెరుగుపడుతోందన్నారు. అతనికి ఇప్పుడు వెంటిలేటర్ సపోర్ట్ లేదని, అప్పుడప్పుడు ఆక్సిజన్ సపోర్ట్ ఇస్తున్నామని వీణా జార్జ్ చెప్పారు.
అనునిత్యం క్షేత్రస్థాయిలోని 19 బృందాలు ప్రొటోకాల్‌ను ఖచ్చితంగా అమలు చేయడంలో సహాయపడ్డాయని, పరిస్థితిని అదుపులోకి తెచ్చాయని ఆమె చెప్పారు. “ఇప్పటివరకు ఇక్క ఆరు పాజిటివ్ కేసులు ఉన్నాయి, గత మూడు రోజులుగా పరీక్షించిన అన్ని సాంపిల్స్ అన్ని నెగెటివ్ వచ్చాయి.” అని మంత్రి చెప్పారు.కేరళ ఆరోగ్య శాఖతో కలిసి పని చేస్తున్న కేంద్ర బృందాలు వ్యాప్తిని సమర్థవంతంగా అరికట్టడానికి డిపార్ట్మెంట్ చేసిన కృషికి ప్రశంసలు వ్యక్తం చేశాయి. కేంద్ర బృందం చర్చల్లో పాల్గొని, రాష్ట్రంలోని బృందాలు చేస్తున్న కృషిని అభినందించాయని కేరళ ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ చెప్పారు.
Also Read
- IMD Big Alert: దేశాన్ని కమ్ముకున్న మేఘాలు.. భారీ వర్షాలకు హెచ్చరిక.. ఇస్రో చిత్రాలు విడుదల
- CJP Protest: ‘మోడీ ప్రభుత్వానికి ఇదే చివరి రోజు’.. ప్రాణత్యాగాలకు సిద్ధంకండి.. సీక్రెట్ యాప్‌పై దర్యాప్తు
- Delhi: ప్రధాని నివాసం ముందు కాంగ్రెస్ ధర్నా.. రాహుల్ గాంధీతో కేంద్రమంత్రి చర్చలు..
- ROKO Jodi: రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అభిమానులకు శుభవార్త.. ఒక్క నెలలో మళ్లీ బరిలోకి..
Also Read: Union Cabinet: ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల వేళ.. కేంద్ర కేబినెట్ కీలక భేటీ
మూడు కేంద్ర బృందాలు, ఐసీఎంఆర్ నుంచి ఒకటి, పుణెలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ నుంచి ఒకటి, ఎపిడెమియోలాజికల్ ఇన్స్టిట్యూట్, చెన్నై నుండి ఒకటి కేరళలో ఉన్నాయి. నిఫా చికిత్స, నియంత్రణలో 2021లో, 2023లో రెండుసార్లు సవరించబడిన ప్రోటోకాల్, మార్గదర్శకాల ప్రకారం సిస్టమ్ చాలా బాగా స్పందించిందని మంత్రి తెలిపారు. “ప్రధానంగా తాము రెమ్‌డెసివిర్ వంటి యాంటీవైరల్ మందులను ఇస్తున్నాము. శిశువులు, పెద్దలకు మోతాదులు అన్నీ బాగా రాయబడ్డాయి. ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులు రెండూ ప్రోటోకాల్‌ను అనుసరిస్తున్నాయి” అని ఆరోగ్య మంత్రి చెప్పారు. మోనోక్లోనల్ యాంటీబాడీని ఉపయోగించే చికిత్సకు సంబంధించి, ప్రస్తుత వేరియంట్ 50-60 శాతం మాత్రమే ప్రభావవంతంగా ఉందని, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ హామీ ఇచ్చిందని మంత్రి చెప్పారు. వైరస్ ఉనికిని నిర్ధారించడానికి 36 గబ్బిలాల నుండి నమూనాలను సేకరించి పూణేలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపినట్లు ఆమె చెప్పారు. ఇప్పటివరకు, 1,233 మందిని గుర్తించామని, వారిలో 352 మంది హై-రిస్క్ కేటగిరీలో ఉన్నారని ఆమె చెప్పారు.
“వన్ హెల్త్” అనేది రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రారంభించిన కార్యక్రమం, ఇక్కడ అన్ని సంబంధిత విభాగాలు అంటు వ్యాధుల వ్యాప్తికి వ్యతిరేకంగా పోరాడటానికి ఒక వేదికను పొందుతాయి. ఏదైనా అంటువ్యాధి వ్యాప్తి చెందితే శాఖల మెరుగైన కలయిక కోసం, కోజికోడ్‌లో వన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోందని మంత్రి తెలిపారు. కేరళ లేదా కోజికోడ్‌ను సందర్శించే ఎవరికైనా పరిమితుల గురించి అడిగినప్పుడు, ప్రయాణ నిషేధం లేదని ఆమె చెప్పారు. కోజికోడ్ జిల్లా మొత్తం కూడా దీని బారిన పడలేదని, కేవలం కొన్ని వార్డులు మాత్రమేనని ఆమె అన్నారు.
తాజావార్తలు
-
IMD Big Alert: దేశాన్ని కమ్ముకున్న మేఘాలు.. భారీ వర్షాలకు హెచ్చరిక.. ఇస్రో చిత్రాలు విడుదల
-
Fauji vs King: బాక్సాఫీస్ వార్.. ప్రభాస్ ‘ఫౌజీ’ vs షారుఖ్ ‘కింగ్’.. వెయ్యి కోట్ల వేటలో విజేత ఎవరు?
-
KVN : విజయ్ లెగసీకి అదిరిపోయే ట్రిబ్యూట్.. ‘జన నాయకుడు’
-
CJP Protest: ‘మోడీ ప్రభుత్వానికి ఇదే చివరి రోజు’.. ప్రాణత్యాగాలకు సిద్ధంకండి.. సీక్రెట్ యాప్‌పై దర్యాప్తు
-
Murali Kishor: ‘లెనిన్’ డైరెక్టర్‌కు బిగ్ ఛాన్స్.. సితారలోనే నెక్స్ట్ మూవీ! ఆ స్టార్ హీరో సినిమా?
ట్రెండింగ్
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్‌తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!
-
తెలంగాణ ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ (TGTET-2026) నోటిఫికేషన్ విడుదల..!
-
స్క్రీన్ లేకుండానే పనిచేసే Google Fitbit Air త్వరలో భారత్‌లో లాంచ్.. ఫీచర్స్ ఇవే.!