NTV Telugu Site icon

Nipah Outbreak: రాష్ట్రానికి బిగ్‌ రిలీఫ్.. నిఫా వైరస్‌పై కేరళ ప్రభుత్వం

Nipah Virus

Nipah Virus

Nipah Outbreak: కేరళలో తాజా నిఫా వైరస్‌ వ్యాప్తికి సంబంధించి పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని, హైరిస్క్ కాంటాక్ట్‌ల నుంచి 200 కంటే ఎక్కువ నమూనాలను పరీక్షించగా నెగెటివ్ అని వచ్చిందని కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ సోమవారం కేరళలో తెలిపారు. ఇప్పటివరకు 1,233 కాంటాక్టులను గుర్తించామని, అందులో అధిక రిస్క్, తక్కువ రిస్క్ కాంటాక్టులుగా వర్గీకరించామని చెప్పారు. చాలా సానుకూల విషయం ఏమిటంటే, చికిత్సలో ఉన్న నలుగురు రోగులు ఇప్పుడు నిలకడగా ఉన్నారని ఆమె తెలిపారు. వెంటిలేటర్ సపోర్ట్‌లో ఉన్న తొమ్మిదేళ్ల బాలుడి పరిస్థితి వైద్యపరంగా మెరుగుపడుతోందన్నారు. అతనికి ఇప్పుడు వెంటిలేటర్ సపోర్ట్ లేదని, అప్పుడప్పుడు ఆక్సిజన్‌ సపోర్ట్ ఇస్తున్నామని వీణా జార్జ్ చెప్పారు.

అనునిత్యం క్షేత్రస్థాయిలోని 19 బృందాలు ప్రొటోకాల్‌ను ఖచ్చితంగా అమలు చేయడంలో సహాయపడ్డాయని, పరిస్థితిని అదుపులోకి తెచ్చాయని ఆమె చెప్పారు. “ఇప్పటివరకు ఇక్క ఆరు పాజిటివ్ కేసులు ఉన్నాయి, గత మూడు రోజులుగా పరీక్షించిన అన్ని సాంపిల్స్ అన్ని నెగెటివ్‌ వచ్చాయి.” అని మంత్రి చెప్పారు.కేరళ ఆరోగ్య శాఖతో కలిసి పని చేస్తున్న కేంద్ర బృందాలు వ్యాప్తిని సమర్థవంతంగా అరికట్టడానికి డిపార్ట్‌మెంట్ చేసిన కృషికి ప్రశంసలు వ్యక్తం చేశాయి. కేంద్ర బృందం చర్చల్లో పాల్గొని, రాష్ట్రంలోని బృందాలు చేస్తున్న కృషిని అభినందించాయని కేరళ ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ చెప్పారు.

Also Read: Union Cabinet: ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల వేళ.. కేంద్ర కేబినెట్ కీలక భేటీ

మూడు కేంద్ర బృందాలు, ఐసీఎంఆర్‌ నుంచి ఒకటి, పుణెలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ నుంచి ఒకటి, ఎపిడెమియోలాజికల్ ఇన్స్టిట్యూట్, చెన్నై నుండి ఒకటి కేరళలో ఉన్నాయి. నిఫా చికిత్స, నియంత్రణలో 2021లో, 2023లో రెండుసార్లు సవరించబడిన ప్రోటోకాల్, మార్గదర్శకాల ప్రకారం సిస్టమ్ చాలా బాగా స్పందించిందని మంత్రి తెలిపారు. “ప్రధానంగా తాము రెమ్‌డెసివిర్ వంటి యాంటీవైరల్ మందులను ఇస్తున్నాము. శిశువులు, పెద్దలకు మోతాదులు అన్నీ బాగా రాయబడ్డాయి. ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులు రెండూ ప్రోటోకాల్‌ను అనుసరిస్తున్నాయి” అని ఆరోగ్య మంత్రి చెప్పారు. మోనోక్లోనల్ యాంటీబాడీని ఉపయోగించే చికిత్సకు సంబంధించి, ప్రస్తుత వేరియంట్ 50-60 శాతం మాత్రమే ప్రభావవంతంగా ఉందని, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ హామీ ఇచ్చిందని మంత్రి చెప్పారు. వైరస్ ఉనికిని నిర్ధారించడానికి 36 గబ్బిలాల నుండి నమూనాలను సేకరించి పూణేలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపినట్లు ఆమె చెప్పారు. ఇప్పటివరకు, 1,233 మందిని గుర్తించామని, వారిలో 352 మంది హై-రిస్క్ కేటగిరీలో ఉన్నారని ఆమె చెప్పారు.

“వన్ హెల్త్” అనేది రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రారంభించిన కార్యక్రమం, ఇక్కడ అన్ని సంబంధిత విభాగాలు అంటు వ్యాధుల వ్యాప్తికి వ్యతిరేకంగా పోరాడటానికి ఒక వేదికను పొందుతాయి. ఏదైనా అంటువ్యాధి వ్యాప్తి చెందితే శాఖల మెరుగైన కలయిక కోసం, కోజికోడ్‌లో వన్ హెల్త్ ఇన్‌స్టిట్యూట్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోందని మంత్రి తెలిపారు. కేరళ లేదా కోజికోడ్‌ను సందర్శించే ఎవరికైనా పరిమితుల గురించి అడిగినప్పుడు, ప్రయాణ నిషేధం లేదని ఆమె చెప్పారు. కోజికోడ్ జిల్లా మొత్తం కూడా దీని బారిన పడలేదని, కేవలం కొన్ని వార్డులు మాత్రమేనని ఆమె అన్నారు.

Show comments