హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో అనస్థీషియా వైద్య విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. విద్యార్థి నితిన్ గురువారం రాత్రి విధులకు హాజరుకాగా.. శుక్రవారం ఉదయం ఆపరేషన్ థియేటర్లో విగతజీవిగా పడి ఉన్నాడు. ఆసుపత్రి సిబ్బంది సమాచారంతో పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మెదక్ జిల్లాకు చెందిన గిరిజన బిడ్డ నితిన్ మృతిపై తల్లిదండ్రలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఏం జరిగిందో తెలియదు అంటూ నిమ్స్ అధికారులు విషయాన్ని గోప్యంగా ఉంచడానికి మీడియాను అన్నివిధాలుగా తప్పుదోవ పట్టిస్తున్నారు.
Also Read: Kishan Reddy: తొందరపడి దళారుల చేతిలో పడొద్దు.. 12 శాతం తేమ ఉన్నా సీసీఐ పత్తి కొంటుంది!
ఎవరో తమ బిడ్డను పొట్టనబెట్టుకుంటే.. ఆత్మహత్య చేసుకున్నట్లుగా చిత్రీకరించే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారని ఆరోపిస్తూ నితిన్ తల్లిదండ్రులు, బంధువులు నిమ్స్ హాస్పిటల్ వద్ద ఆందోళన చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు వాస్తవమేంటో బయటపెట్టాలని జూనియర్ డాక్టర్లు, నితిన్ సహచరులు, మిత్రులు డిమాండ్ చేస్తున్నారు. ఆరోగ్య శాఖ మంత్రి గారు.. మీ సొంత ఉమ్మడి జిల్లాకు చెందిన విద్యార్థి మృతిపై వెంటనే స్పందించాల్సిన అవసరముంది, ఎలా నితిన్ మృతి చెందాడు తెలుసుకుని ప్రకటన చేయాలంటూ మృతుడి బంధువులు, స్నేహితులు డిమాండ్ చేస్తున్నారు.
