Site icon NTV Telugu

NIMS: నిమ్స్ అగ్ని ప్రమాద ఘటనకు సిగిరెట్టే కారణం!

Nims

Nims

పంజాగుట్ట నిమ్స్ ఆస్పత్రి అత్యవసర వైద్య విభాగంలో అగ్ని ప్రమాద ఘటనకు సిగిరెట్టే కారణమని అధికారులు నిర్ధారించారు. సిగరెట్, చెత్తతోనే అగ్ని ప్రమాదం జరిగిందని స్పష్టం చేశారు. బీడీ, సిగరెట్ కేర్ లెస్ స్మోక్ వల్ల అగ్నిప్రమాదం జరిగినట్లు గుర్తించారు. శనివారం సాయంత్రం అత్యవసర వైద్య విభాగంలోని ఐదో అంతస్తు ఆడిటోరియంలో చిన్నపాటి అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. కిటికీల నుంచి దట్టమైన పొగ బయటకు రావడంతో అందరూ భయభ్రాంతులకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది సంఘటన స్థలికి చేరుకొని.. మంటలను అదుపు చేశారు.

ఐదో అంతస్తులో రోగులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. పొగ కంట్రోల్‌కి వచ్చాక అగ్నిప్రమాదం ఎందుకు జరిగిందన్న కోణంలో దర్యాప్తు చేపట్టారు. లిఫ్ట్ పక్కన్న ఉన్న చెత్తలో తాగిన బీడీ, సిగరెట్ వేయడం వల్లే అగ్నిప్రమాదం జరిగిందని తేల్చారు. బీడీ, సిగరెట్ కేర్ లెస్ స్మోక్ వల్ల అగ్నిప్రమాదం జరిగినట్లు గుర్తించారు. మొదట సిగరెట్‌తో చెత్త అంటుకొని.. ఆ తర్వాత ఎలక్ట్రిసిటీ వైర్లకు అంటుకుందని నిర్ధారించారు. 5వ ఫ్లోర్ ఖాళీగా ఉండడంతో సిబ్బంది అక్కడ చెత్తను పడేస్తున్నారు. అక్కడే ఇతరులు సిగరెట్ తాగి పడేయడంతో ఈ ఘటన జరిగింది.

Exit mobile version