Site icon NTV Telugu

Cyber ​​Fraud: సైబర్ మోసానికి గురైన నిమ్స్ ఫైనాన్స్ సెక్రటరీ…

Cyber Fraud

Cyber Fraud

నిమ్స్ ఆస్పత్రిలో సైబర్ మోసానికి గురయ్యారు నిమ్స్ ఫైనాన్స్ సెక్రటరీ. నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప పేరుతో ఓ సైబర్ మోసగాడు డబ్బులు వసూలు చేస్తున్నాడు. డాక్టర్ బీరప్ప ఫోటోని డీపీగా పెట్టి తాను ఒక మీటింగ్ లో ఉన్నానని అర్జెంటుగా రూ. 50 వేలు పంపాలని బీరప్ప పేరుతో ఫైనాన్స్ కంట్రోలర్ కి వాట్సాప్ మెసేజ్ పంపించాడు. దాన్ని గుడ్డిగా నమ్మిన నిమ్స్ ఫైనాన్స్ కంట్రోలర్ 50 వేలు తన వద్ద లేకపోయినా వేరే ఇంకొకరి దగ్గర చేతి బదులు తీసుకుని సదరు వ్యక్తికి ఫార్వర్డ్ చేశారు.

Read Also: Bimbisara 2: వశిష్ట అవుట్.. ఆ డైరెక్టర్ చేతికి బింబిసార 2 బాధ్యతలు

ఇవ్వాళ మధ్యాహ్నం ఫైనాన్స్ కంట్రోలర్ మోహన్, నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప వద్దకు వెళ్లి సర్ మీరు చెప్పిన అకౌంట్ కి రూ. 50 వేలు పంపించాను అనడంతో నిమ్స్ డైరెక్టర్ ఖంగుతిన్నారు. వెంటనే వివరాలు చెక్ చేస్తే పంపిన నెంబర్ శ్రీలంకకు చెందిందిగా తెలుస్తోంది. మొత్తానికి మోసపోయామని అర్థమయిన నిమ్స్ ఫైనాన్స్ కంట్రోలర్.. డైరెక్టర్ సలహాతో ఇవాళ మధ్యాహ్నం సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు చేశారు.

Read Also: Hezbollah Attack: ఇజ్రాయెల్‌పైకి హెజ్‌బొల్లా ప్రతీకార దాడులు.. 200 రాకెట్లు ప్రయోగం

Exit mobile version