Site icon NTV Telugu

Liquor Case: లిక్కర్ కేసుపై మాట్లాడే అర్హత ఆయనకు ఉందా: మంత్రి నిమ్మల

Nimmala Ramanayudu

Nimmala Ramanayudu

Liquor Case: తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించిన మంత్రి నిమ్మల రామానాయుడు మీడియాతో మాట్లాడారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లిక్కర్ కేసుపై మాట్లాడే అర్హత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి ఉందా అని ప్రశ్నించారు. లిక్కర్ తయారు చేసే డిక్షనరీ ఫ్యాక్టరీలు అన్నింటినీ సీ‌ఎంగా ఉన్న సమయంలో జగన్ తన గుప్పెట్లో పెట్టుకున్నాడని విమర్శించారు.

READ ALSO: Rakul Preet : కత్తిలాంటి అందాలతో రకుల్ రచ్చ..

ప్రభుత్వాన్ని అడ్డంగా పెట్టుకుని కల్తీ మద్యాన్ని ఏవిధంగా అమ్మేరో చూసాం, పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో కల్తీ మద్యం తాగి 27 మంది చనిపోయిన ఘటనలు వెలుగు చూశాయి అని చెప్పారు. ఆ సమయంలో ఆరోగ్యాన్ని కొల్లగట్టడంతో పాటు జోబులు కూడా గుల్ల చేశారని ధ్వంజం ఎత్తారు. ఇవి కాకుండా గత పాలకులు లిక్కర్‌పై కూడా రుణాలు తీసుకుని వచ్చారని విమర్శించారు.
కల్తీ మద్యంపై సీఎం చంద్రబాబు ఉక్కు పాదం మోపారని అన్నారు.

రాష్ట్రంలో నకిలీ మద్యాన్ని వెలికి తీసింది కూటమీ ప్రభుత్వమని అన్నారు. నకిలీ మద్యం తయారు చేసిన వారిని అరెస్టు చేసింది కూడా తామే అని చెప్పారు. జగన్ ప్రభుత్వంలో నకిలీ మద్యం తయారు చేసిన వారిలో ఎవరినైనా అరెస్ట్ చేశారా అని ప్రశ్నించారు. ప్రస్తుతం రాష్ట్రంలో నకిలీ మద్యం ఎవరైనా తయారు చేయాలంటే అదే వారికి చివరి రోజు అవుతాదనే భయం నెలకొనేలా చర్యలు తీసుకున్నాం అని అన్నారు. కల్తీ మద్యం తయారీలో నైపుణ్యం కలిగిన వారు కండువాలు మార్చిన ఉపేక్షించకుండా చర్యలు తీసుకున్నామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో నకిలీ మద్యానికి చెక్ పెట్టేందుకు కూటమి ప్రభుత్వం ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ తీసుకువచ్చినట్లు చెప్పారు.

READ ALSO: Vadarevu Beach Tragedy: సరదాగా వెళ్తే ముగ్గురిని బలితీసుకున్న రాకాసి అలలు.. వాడరేవు తీరంలో విషాదం

Exit mobile version