Site icon NTV Telugu

Nimmala Ramanaidu: కూతురు పెళ్లిలోనూ పసుపు చొక్కానే ధరించిన మంత్రి.. నారా లోకేష్ ఆసక్తికర వ్యాఖ్య..

Nara Locash

Nara Locash

Nimmala Ramanaidu: సందర్భం ఏదైనా తెలుగు దేశం పార్టీపై .. పసుపు రంగుపై ఆయనకి ఉన్న అభిమానాన్ని, ఆప్యాయతని వదిలిపెట్టని నాయకుడిగా మారిపోయారు మంత్రి నిమ్మల రామానాయుడు. పార్టీ కార్యక్రమమైన, అసెంబ్లీ సమావేశాలైన నిత్యం పసుపు చొక్కాతో కనిపించే మంత్రి నిమ్మల రామానాయుడు తన కూతురి వివాహ వేడుకలోనూ పసుపు చొక్కాని వదిలిపెట్టలేదు. పాలకొల్లులో ఈరోజు జరిగిన నిమ్మల రామానాయుడు కుమార్తె శ్రీజ వివాహానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులతో పాటు ఎంపీలు, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నాయకులు హాజరయ్యారు. ఆ సమయంలోనూ మంత్రి నిమ్మల పసుపు చొక్కాతోనే కనిపించడం విశేషంగా మారింది.

READ MORE: KTR: బీజేపీ మోసం రాముడికి కూడా అర్థమైంది.. కరీంనగర్ ప్రజలు మాత్రం..!

కొద్ది రోజుల క్రితం జరిగిన రామానాయుడు కుమార్తె శ్రీజ నిశ్చితార్థ వేడుక వేడుకలో సైతం పసుపు చొక్కా ధరించి ఉన్న రామానాయుడిని చూసి మంత్రి లోకేష్ అవాక్కయ్యారు. “పెళ్ళికొడుకులా తయారు అవుతారు అనుకుంటే పసుపు చొక్కాతో కనిపించావేటి సామీ” అంటూ మంత్రి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆకర్షించాయి. మంత్రి లోకేష్ కు స్వాగతం పలికేందుకు రామానాయుడు పసుపు చొక్కా ధరించి రావడంతో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దీనికి రామానాయుడు పసుపు శుభ సూచకం సార్ అంటూ సమాధానమిచ్చారు. దీంతో చుట్టుపక్కల వారు నవ్వులు పూయించారు. సందర్భం ఏదైనా పసుపు రంగుపై నిమ్మల రామానాయుడుకి ఉన్న అభిమానాన్ని తన కూతురిని వివాహ వేడుకలోనూ మరోసారి చూపించారు.

READ MORE: Pakistan: పాకిస్తాన్ స్కూల్ బుక్స్‌లో ‘‘ఆపరేషన్ సిందూర్’’.. అన్ని అబద్ధాలే..

Exit mobile version