NTV Telugu Site icon

Nimmala Ramanaidu : పోల‌వ‌రం ట‌న్నెల్స్ బ్యాలెన్స్ ప‌నుల పురోగతిపై స‌మీక్ష

Nimmala

Nimmala

Nimmala Ramanaidu : అమ‌రావ‌తి సచివాలయంలో రాష్ట్రంలోని ఇరిగేష‌న్ ప్రాజెక్టులపై ఆయా ప్రాజెక్టుల సీఈలు, ఎస్ఈలు, కాంట్రాక్ట్ ఏజెన్సీల‌ ప్రతినిధులతో మంత్రి నిమ్మల రామానాయుడు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఇరిగేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జి. సాయి ప్రసాద్, కడ కమిషనర్ రామసుందరరెడ్డి, ఈఎన్సీ ఎం. వెంకటేశ్వరరావు లు హాజరయ్యారు. డిసెంబ‌ర్ మొద‌టి వారంలో ముఖ్యమంత్రి పోల‌వ‌రంలో ప‌ర్యటించి డయా ఫ్రం వాల్, ఈసీఆర్ఎఫ్ డ్యాం ప‌నులు షెడ్యూల్ విడుద‌ల‌పై రివ్యూ చేస్తారని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలోనే.. పోల‌వ‌రం ట‌న్నెల్స్ బ్యాలెన్స్ ప‌నులు, లెప్ట్ కెనాల్ ప‌నుల పురోగ‌తిపై స‌మీక్ష చేశారు మంత్రి నిమ్మల రామానాయుడు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు పోల‌వ‌రం ప్రాజెక్టు ప‌నుల పురోగ‌తి తెలుసుకునేలా వెబ్సైట్ ప్రారంభించి ఎప్ప‌టిక‌ప్పుడు వర్క్ అప్డేట్ చేయాలని అధికారులకు ఆదేశించారు.

V. Hanumantha Rao: వి.హనుమంతరావు కారును ఢీ కొట్టిన మరో వాహనం.. సీసీ ఫుటేజ్ లో దృశ్యాలు..

హంద్రీ-నీవా వెలిగొండ‌,చింత‌ల‌పూడి త‌దిత‌ర ప్రాధాన్య ప్రాజెక్టుల ప‌నుల ఆర్దిక ఇబ్బందుల‌ను అధిగ‌మించి పూర్తి చేయడంపై ప్ర‌త్యేక దృష్టి పెట్టాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు. సాగు నీటి సంఘాల ఎన్నిక‌లు ప్రశాంతంగా నిర్వ‌హించే విధంగా ఏర్పాట్లు చేయాల‌ని అధికారుల‌కు ఆదేశించారు. అంతేకాకుండా.. సాగునీటి సంఘాలకు డిసెంబర్ 8 వ తేదీన జరిగే ఎన్నికల కోసం రెవెన్యూ, ఇరిగేషన్ శాఖలు సమన్వయం చేసుకోవాలన్నారు. సాగు నీటి సంఘాల కాలువలు, డ్రైన్స్ వంటి ఇరిగేషన్ పనులలో రైతుల భాగస్వామ్యం, ప్రాతినిధ్యం లభిస్తుందన్నారు మంత్రి నిమ్మల రామానాయుడు.

Rahul Gandhi: గౌతమ్ అదానీని వెంటనే అరెస్ట్ చేయండి..