ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్ష ఎమ్మెల్యేల ప్రాణాలకు రక్షణ లేకుండాపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు టీడీఎల్పీ ఉప నేత నిమ్మల రామానాయుడు. అసెంబ్లీ హైసెక్యూర్టీ జోన్ అయినా.. ప్రతిపక్షానికి ప్రతికూలమైన జోన్.మా సభ్యుల ప్రాణాలకు అపాయం కలిగించే రీతిలో దాడి జరిగింది కాబట్టే.. పోలీస్ స్టేషనులో ఫిర్యాదు చేశాం.సభలో భౌతిక దాడులు జరిగితే పోలీస్ విచారణ జరపొచ్చనే రూలింగ్.. నిబంధనలు ఉన్నాయి.పవిత్రమైన అసెంబ్లీలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు.వైసీపీ ఎమ్మెల్యేలు సుధాకర్ బాబు, ఎలీజా, వెలంపల్లి, కార్మూరి టీడీపీ సభ్యులపై దాడి చేశారు.ఇలాంటి సంఘటనను ఇప్పటి వరకు చూడలేదు.
అసెంబ్లీ చరిత్రలో తొలిసారి ఎమ్మెల్యేలపై దాడులు జరిగాయి.జీవో నెెంబర్-1 రద్దు చేయాలని కోరితే దాడులు చేస్తారా..?కుట్రపూరితంగానే టీడీపీ సభ్యుడు స్వామి, అశోక్, బుచ్చయ్యల మీద దాడి చేశారు.జగన్ డైరెక్షనులోనే స్వామి తదితర ఎమ్మెల్యేలపై భౌతిక దాడి జరిగింది.ఇవాళ దాడి చేసిన వాళ్లు.. ప్రాణాలు తీస్తారనే అనుమానం ఉంది.మేం తుళ్లూరు పీఎస్సులో ఫిర్యాదు చేశాం.. ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి.సుధాకర్ బాబు మళ్లీ కోడి కత్తి తరహా డ్రామా ఆడుతున్నారు.. అందుకే కట్టు కట్టుకున్నారు.ఉదయం సంఘటన జరిగితే ఇప్పటి వరకు వీడియో ఫుటేజ్ ఎందుకు విడుదల చేయలేదు..?ఎడిటింగ్ చేయకుండా వీడియో ఫుటేజ్ విడుదల చేస్తే అసలు వాస్తవాలు బయటకు వస్తాయన్నారు రామానాయుడు.
Read Also: Man Ate Women Parts: మనిషా.. మృగమా.. అమ్మాయిలను చంపి దాన్ని కోసి వండుకొని తింటూ
మరోవైపు తుళ్లూరు పోలీస్ స్టేషనుకు టీడీపీ ఎమ్మెల్యేలు చేరుకున్నారు. అసెంబ్లీలో వైసీపీ ఎమ్మెల్యేలు దాడి చేశారంటూ తుళ్లూరు పీఎస్ లో ఫిర్యాదుచేశారు. వైసీపీ ఎమ్మెల్యేలు సుధాకర్ బాబు, ఎలీజాలపై టీడీపీ ఎమ్మెల్యేలు స్వామి, బుచ్చయ్యల ఫిర్యాదు చేశారు. మంత్రి కార్మూరి.. వెలంపల్లి పైనా తుళ్లూరు పీఎస్ లో ఫిర్యాదు చేసింది టీడీపీ. అసెంబ్లీలో జరిగిన ఘటనపై విచారణ జరిపి.. ఎడిటింగ్ చేయని వీడియో ఫుటేజ్ పరిశీలించాలని టీడీపీ ఎమ్మెల్యేల వినతి పత్రం అందచేశారు. పోలీస్ స్టేషనుకు వచ్చే ముందు తుళ్లూరు సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారు టీడీపీ ఎమ్మెల్యేలు.
Read Also: Immoral Relationship : తల్లిని అలా చూసి తట్టుకోలేక.. ఆమె ప్రియుడిని కొట్టి చంపేశారు
టీడీపీ ఎమ్మెల్యే బాలవీరాంజనేయస్వామి మాట్లాడుతూ.. సుధాకర్ బాబు తనంతట తానే బ్లేడుతో చిన్న గాయం చేసుకున్నారు.సుధాకర్ బాబు కావాలనే బ్లేడుతో గాటు పెట్టుకున్నారని వైసీపీ సభ్యులే చెబుతున్నారు.పథకం ప్రకారం దాడి జరిగింది.నాపై దాడి జరిగిందనడానికి స్పీకరే ప్రత్యక్ష సాక్షి.ప్రతి ఒక్కరూ దీన్ని గమనిస్తున్నారు. మరో టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ.. సభలో ప్రతిపక్ష సభ్యులకు రక్షణ లేదు. స్పీకర్ పోడియం వద్దకు మేం వెళ్తే మార్షల్స్ రావచ్చు.. కానీ అధికార పార్టీ సభ్యులకేం సంబంధం..? అన్నారు.
నియంతలకు పట్టిన గతే జగనుకూ పడుతుంది. టీడీపీ ఎమ్మెల్యే బెందాళం అశోక్ మాట్లాడుతూ.. నా పైనా దాడి జరిగింది.నా చేయి బెణికింది.దళిత సభ్యుడిపై దాడి చేయడం అమానుషం.ప్రతిపక్ష సభ్యులకు రక్షణ లేకుంటే ఎలా..? అన్నారు. ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు మాట్లాడుతూ.. మేం తప్పు చేస్తే సస్పెండ్ చేయొచ్చు.అధికార పార్టీ సభ్యులతో దాడి చేయిస్తారా..?వైసీపీ ఎమ్మెల్యేలు సభలో నానా దుర్భషలాడుతున్నారు.. బండ బూతులు తిడుతున్నారు.అసెంబ్లీలో జరిగిన ఘటనపై వెంటనే విచారణ చేయించాలన్నారు.
