Site icon NTV Telugu

Nimmala Rama Naidu: మాల్యాల హంద్రీనీవా పంప్ హౌజ్‭ను పరిశీలించిన మంత్రి నిమ్మల..

Nimmala Rama Naidu

Nimmala Rama Naidu

Nimmala Rama Naidu: చంద్రబాబు ఆదేశాల మేరకు హంద్రీనీవా సామర్థ్యం పెంచేలా, ప్రధాన కాలువ విస్తరించడానికే పర్యటన చేసినట్లు మంత్రి నిమ్మల తెలిపారు. ఎన్టీఆర్ కలగన్నట్లు రాయల సీమను రతనాల సీమగా మారుస్తాం.. ఆసియాలోనే పెద్దది, పొడవైన ఎత్తిపోతల పథకం నిర్మించిన ఘనత టీడీపీదే. 3,850 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోసేలా చంద్రబాబు మల్యాల ఎత్తిపోతల పథకాన్ని నిర్మించారు. జగన్ పాలనలో హంద్రీ నీవా పనులు వెనుకబడిపోయాయి. ప్రాజెక్ట్ సామర్థ్యం 40 వేల టీఎంసీలు. అయితే కనీసం 20 వేల టీఎంసీల నీటిని కూడా రాయల సీమకు అందించలేదు. గత ప్రభుత్వం చేసిన తప్పులు సరిదిద్ది, హంద్రీ నీవాను పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకోస్తాం. గత ఐదేళ్లలో ఇరిగేషన్ లో చేసిన పాపాలు, తప్పులు సరిచేస్తున్నాం.

Bhumana Karunakar Reddy: చంద్రబాబు ఘోరమైన అపచారం చేశాడు‌.. టీటీడీ మాజీ చైర్మన్

అన్నమయ్య ప్రాజెక్ట్ కొట్టుకుపోతే జగన్ సీఎం ఉండి భాదితులను పరామర్శించలేదు. కృష్ణా నదికి వరదలు వస్తే పరిస్థితులు సరిదిద్ది ప్రజాపాలన ఎలా ఉంటుందో చంద్రబాబు చేసి చూపించారు. జగన్ తన పాలనలో బడ్జెట్ లో సాగు నీటికి 2 శాతమే నిధులు కేటాయించాడు. గత టీడీపీ పాలనలో హంద్రీనీవా కు 4వేల కోట్లు కు పైగా ఖర్చుపెడితే, జగన్ పాలనలో కేవలం 500 కోట్లు మాత్రమే ఖర్చుపెట్టాడు. మా హయాంలో హంద్రీనీవ కాలువల పనులు 90 శాతం పూర్తి చేస్తే జగన్ మిగిలిన 10 శాతం పనులు పూర్తి చేయలేదు. నెలలో రెండు సార్లు రాయలసీమలో పర్యటించి సీమ ప్రాజెక్టులు త్వరగా పూర్తి అయ్యేలా చేస్తాం అని ఆయన తెలిపారు.

Exit mobile version