NTV Telugu Site icon

Nikhil Siddhartha : ఘనంగా జరిగిన నిఖిల్ భార్య సీమంతం వేడుక.. ఫోటోస్ వైరల్..

Whatsapp Image 2024 01 31 At 10.52.25 Pm

Whatsapp Image 2024 01 31 At 10.52.25 Pm

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు..డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన హ్యాపీ డేస్ సినిమాతో హీరోగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు నిఖిల్. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించి మెప్పించారు.. కార్తికేయ, స్వామిరారా వంటి సినిమాలతో సూపర్ హిట్స్ అందుకొని యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు.ఇటీవల కార్తికేయ 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నిఖిల్ పాన్ ఇండియా స్థాయిలో తన కెరీర్ లోనే బిగ్గెస్ విజయం అందుకున్నాడు..ప్రస్తుతం ఈ యంగ్ హీరో “స్వయంభు” అనే బిగ్గెస్ట్ హిస్టోరికల్ మూవీలో నటిస్తున్నాడు..ఈ మూవీలో నిఖిల్ వారియర్ పాత్రలో కనిపించనున్నారు.ఈ సినిమా కోసం దాదాపు మూడు నెలలపాటు యుద్ధవిద్యలపైనే నిఖిల్ శిక్షణ తీసుకున్నాడు. అంతేకాకుండా ఈ సినిమా కోసం తన లుక్ పూర్తిగా మార్చేశాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ జరుపుకుంటుంది..

ఇదిలా ఉంటే హీరో నిఖిల్ 2020లో డాక్టర్ పల్లవి వర్మను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. లాక్ డౌన్ సమయంలో ఎంతో సింపుల్‏గా వీరి వివాహం జరిగింది. త్వరలోనే నిఖిల్ తండ్రి కూడా కాబోతున్నారు. తాజాగా ఆయన భార్యకు సీమంతం వేడుకను నిర్వహించారు. ఈ విషయాన్ని నిఖిల్ తన ట్విటర్ ద్వారా పంచుకున్నారు..ఈ వేడుకలో తన భార్యతో కలిసి దిగిన ఫోటోను ట్విట్టర్ వేదికగా షేర్ చేస్తూ అందరి ఆశీస్సులు కావాలంటూ రాసుకొచ్చారు.నా భార్యకు భారతీయ సంప్రదాయంలో సీమంతం వేడుక జరిగింది. పల్లవి, నేను త్వరలోనే మా మొదటి బిడ్డకు స్వాగతం పలకబోతున్నాం. ఈ విషయాన్ని ప్రకటించడానికి మేము చాలా సంతోషిస్తున్నాం. దయచేసి మాకు పుట్టబోయే బిడ్డకు మీ అందరి ఆశీస్సులు పంపండి’ అంటూ నిఖిల్ పోస్ట్ చేశారు. ఇది చూసిన అభిమానులు నిఖిల్, పల్లవికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో బాగా వైరలవుతుంది.