Nikhil Movie: 20 రోజులకే.. ఓటీటీలోకి వచ్చేసిన నిఖిల్ కొత్త సినిమా!
- నవంబర్ 8న థియేటర్లలో విడుదల
- సైలెంట్‌గా ఓటీటీలోకి నిఖిల్ సినిమా
- అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇటీవలి రోజుల్లో కొన్ని సినిమాలు సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. రిలీజ్ డేట్ కూడా ప్రకటించకుండానే.. చెప్పపెట్టకుండా ఓటీటీలో దర్శనమిస్తున్నాయి. తాజాగా మరో తెలుగు సినిమా సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ నటించిన తాజా చిత్రం ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ ఓటీటీలో అందుబాటులో ఉంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ‘రిషి, తారల ప్రేమ కథను చూసేయండి’ అని అమెజాన్ పోస్ట్ పెట్టింది.
Also Read: Vikram Reddy: మూవీ బాగోలేదని ఒక్కరు అన్నా.. సినిమాలకు రిటైర్మెంట్ ఇస్తా: డైరెక్టర్ విక్రమ్
Also Read
స్వామిరారా, కేశవ తర్వాత నిఖిల్, సుధీర్ వర్మ కాంబినేషన్లో వచ్చిన సినిమా అప్పుడో ఇప్పుడో ఎప్పుడో. రుక్మిణీ వసంత్, దిశ్యాంశ కౌశిక్ హీరోయిన్లు. ఈ సినిమాలో నిఖిల్ రేసర్‌గా నటించారు. నవంబర్ 8న థియేటర్లలో విడుదలైంది. మొదటి షోకే బ్యాడ్ టాక్ రావడంతో.. థియేటర్లలోకి వచ్చిన ఒకటి, రెండు రోజుల్లో మాయమైపోయింది. థియేటర్లలో చూడని వారు ఇప్పుడు ఓటీటీలో చూడొచ్చు. కార్తికేయ 2 తర్వాత పాన్ ఇండియా లెవల్లో క్రేజ్ సంపాదించుకున్న నిఖిల్.. ఇటీవల ఆ స్థాయి సినిమాలు చేయట్లేదు. స్పై మూవీ ఫ్లాప్ అయింది. అప్పుడో ఇప్పుడో ఎప్పుడో అయితే అట్టర్ ఫ్లాప్ అనే చెప్పాలి.
high OCTANE thrill meets breezy ROMANCE – Rishi & Tara’s story is an eclectic mix of all 🔥🫰#AppudoIppudoEppudoOnPrime, watch now: https://t.co/E13aHqpQOn pic.twitter.com/apBDEZ56Gw
— prime video IN (@PrimeVideoIN) November 26, 2024
తాజావార్తలు
-
Harish Rao: సామాన్యుడిపై ధరల భారం.. ప్రభుత్వం నిద్రమత్తులో ఉందా?
-
ICC fine: వెస్టిండీస్‌తో ఓటమి.. టీమిండియాకు బిగ్ షాక్ ఇచ్చిన ఐసీసీ..
-
Oppo F35, F35 Pro: ఒప్పో F35, F35 Pro భారత్‌లో లాంచ్.. రూ.38,999కే 8,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్!
-
Supreme Court: జ్ఞానేష్ కుమార్ సస్పెన్షన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు
-
Karimnagar Collectorate : కలెక్టరేట్లో బిగ్ షాక్.. తృటిలో తప్పిన ప్రమాదం.!
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?