Site icon NTV Telugu

Nikhil Movie: 20 రోజులకే.. ఓటీటీలోకి వచ్చేసిన నిఖిల్ కొత్త సినిమా!

Appudo Ippudo Eppudo Review

Appudo Ippudo Eppudo Review

ఇటీవలి రోజుల్లో కొన్ని సినిమాలు సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. రిలీజ్ డేట్ కూడా ప్రకటించకుండానే.. చెప్పపెట్టకుండా ఓటీటీలో దర్శనమిస్తున్నాయి. తాజాగా మరో తెలుగు సినిమా సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. టాలీవుడ్ యంగ్‌ హీరో నిఖిల్‌ నటించిన తాజా చిత్రం ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ ఓటీటీలో అందుబాటులో ఉంది. అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ‘రిషి, తారల ప్రేమ కథను చూసేయండి’ అని అమెజాన్‌ పోస్ట్‌ పెట్టింది.

Also Read: Vikram Reddy: మూవీ బాగోలేదని ఒక్కరు అన్నా.. సినిమాలకు రిటైర్‌మెంట్‌ ఇస్తా: డైరెక్టర్ విక్రమ్‌

స్వామిరారా, కేశవ తర్వాత నిఖిల్‌, సుధీర్‌ వర్మ కాంబినేషన్‌లో వచ్చిన సినిమా అప్పుడో ఇప్పుడో ఎప్పుడో. రుక్మిణీ వసంత్‌, దిశ్యాంశ కౌశిక్‌ హీరోయిన్లు. ఈ సినిమాలో నిఖిల్‌ రేసర్‌గా నటించారు. నవంబర్ 8న థియేటర్లలో విడుదలైంది. మొదటి షోకే బ్యాడ్ టాక్ రావడంతో.. థియేటర్లలోకి వచ్చిన ఒకటి, రెండు రోజుల్లో మాయమైపోయింది. థియేటర్లలో చూడని వారు ఇప్పుడు ఓటీటీలో చూడొచ్చు. కార్తికేయ 2 తర్వాత పాన్ ఇండియా లెవల్లో క్రేజ్ సంపాదించుకున్న నిఖిల్.. ఇటీవల ఆ స్థాయి సినిమాలు చేయట్లేదు. స్పై మూవీ ఫ్లాప్ అయింది. అప్పుడో ఇప్పుడో ఎప్పుడో అయితే అట్టర్ ఫ్లాప్ అనే చెప్పాలి.

Exit mobile version