‘కార్తికేయ-2’తో నేషనల్ లెవల్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసిన నిఖిల్, ఇప్పుడు ఒక యోధుడి కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. భారీ బడ్జెట్‌తో, అత్యున్నత సాంకేతిక విలువలతో రూపొందుతున్న ‘స్వయంభు’. శ్రీకృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం నిఖిల్ కెరీర్‌లోనే మైల్ స్టోన్ ప్రాజెక్ట్‌గా నిలవనుంది. ఒక యోధుడి గెటప్‌లో నిఖిల్ ఈ సినిమా కోసం మేకోవర్ అయిన తీరు.. ఇప్పటికే ఆసక్తిని పెంచగా, తాజాగా టీజర్ లాంచ్‌కు ముహూర్తం ఖరారైంది.
Also Read : Laya: బాలకృష్ణపై నటి లయ క్రేజీ కామెంట్స్..!
ఈ ప్రతిష్టాత్మక సినిమా విజువల్స్ ఎలా ఉండబోతున్నాయో చూపించేందుకు నిఖిల్ టీమ్ రెడీ అయిపోయింది. ఫిబ్రవరి 11న ఉదయం 9 గంటలకు హైదరాబాద్‌లోని ప్రసాద్స్ ఐమాక్స్ (PCX)లో భారీ స్క్రీన్లపై టీజర్‌ను ప్రదర్శించనున్నారు. అదే రోజు సాయంత్రం 5 గంటలకు ముంబైలోని జుహూ పీవీఆర్ డైనమిక్ థియేటర్‌లో మరో ఈవెంట్‌ను ప్లాన్ చేశారు. ఈ రెండు ఈవెంట్లలోనూ హీరో నిఖిల్, హీరోయిన్లు సంయుక్త మీనన్, నభా నటేష్, చిత్ర యూనిట్ మొత్తం పాల్గొనబోతున్నారు. అభిమానుల కోసం ప్రత్యేకంగా పాస్‌లను కూడా అందుబాటులో ఉంచారు. . పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానున్న ఈ సినిమా టీజర్ కోసం సినీ ప్రియులు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.
Swayambhu Teaser this Feb 11th
Hyderabad Prasads PCX 9 am onwards
🔥Large Screens
Mumbai Pvr Dynamic Juhu 5 pm onwards
Watch it with the Cast & Crew of #Swayambhu BOOK ur Passes 👇🏾
– https://t.co/BcFN9IGNJe#SwayambhuTeaser
@iamsamyuktha_ @NabhaNatesh @krishbharat20… pic.twitter.com/0Vk722YsYI— Nikhil Siddhartha (@actor_Nikhil) February 9, 2026
