Nikhil: మూసేసిన ఆలయాన్ని తెరిపించిన హీరో నిఖిల్.. పూల వర్షంతో ఘనంగా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nikhil Siddhartha: టాలీవుడ్ వర్ధమాన హీరో నిఖిల్ సిద్ధార్థ్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. వైవిధ్యభరితమైన కథలతో సినిమాలు చేస్తూ టాలీవుడ్ హీరోల్లో ఆయన కూడా ఒకరు. స్వామి రారా, కార్తికేయ, సూర్య వర్సెస్ సూర్య, ఎక్కడికి పోతావు చిన్నవాడా, కేశవ, కిరాక్, అర్జున్ సురవరం, కార్తికేయ 2, 18 పేజీలు వంటి సూపర్ హిట్ చిత్రాలను నిఖిల్ విభిన్న కథలను ఎంచుకంటూ తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని అందుకున్నారు. ఈ హీరో పాన్ – ఇండియన్ లెవెల్ లో కూడా ప్రసిద్ధి చెందాడు. ముఖ్యంగా కార్తికేయ 2 చిత్రానికి గాను ఈ యంగ్ హీరో బాగా పాపులర్ అయ్యాడు. ఇప్పుడు ‘స్వయంభూ’ అనే మరో క్రేజీ ప్రాజెక్ట్‌లో లీడ్ రోల్ చేస్తున్నాడు.
Kamineni Srinivas: ఎన్డీఏలో ఉండి కేంద్రం సపోర్టు చేస్తేనే ఏపీ అభివృద్ధి సాధ్యం..
Also Read
- Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ 'మష్రూమ్ పులావ్'.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!
- Budameru Floods: బుడమేరులో పెరిగిన వరద ఉద్ధృతి.. అప్రమత్తమైన అధికారులు..
- Anakapalli: వర్షాల వేళ విషాదం.. తల్లీకూతుళ్లను బలిగొన్న విద్యుత్ వైరు
- AP Heavy Rains: వర్ష బీభత్సం.. విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం.. కొన్ని రద్దు, మరికొన్ని దారి మళ్లింపు
ఇక కేవలం సినిమాలే కాకుండా నిఖిల్ చేసిన ఓ మంచి పనికి సోషల్ మీడియాలో ఆయనపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇక ఈ ఘటనకు సంబంధించి వివరాలు చూస్తే.. ఏపీలోని చీరాలలో కొన్ని సంవత్సరాలుగా ఓ ఆలయం మూసి ఉండగా.. ఆ ఆలయ నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో దేవాలయం శిథిలావస్థకు చేరువలోకి వచ్చింది. ఇకపోతే తాజాగా ఈ ఆలయాన్ని తిరిగి తెరిపించాడు హీరో నిఖిల్. ఆలయాన్ని తెరిపించడమే కాకుండా దాని నిర్వహణ బాధ్యతలు కూడా ఆయన తీసుకున్నాడు.
PM Modi: ప్రధాని పదవికి నరేంద్రమోడీ రాజీనామా.. రాష్ట్రపతి ఆమోదం..
ఈ సందర్భంగా ఆలయాన్ని పునఃప్రారంభించేందుకు వచ్చిన హీరో నిఖిల్‌ను పూలపై నడిపించి ఆహ్వానించారు. ఈ విషయాన్ని నిఖిల్ తన సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. నిఖిల్‌ని పూల పై నడిపిస్తున్న సమయంలో గ్రామంలోని ప్రతి ఒక్కరినీ చూడొచ్చు. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన నిఖిల్.. మీకు సేవ చేసిన ఘనత తన కుటుంబానికి దక్కిందని సంతోషం వ్యక్తం చేశాడు. ఆలయాన్ని పూర్తిగా పూర్తి చేస్తామని గ్రామస్తులకు హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా పాపులర్ అవుతోంది. నిఖిల్ చేసిన గొప్ప పనికి అభిమానులు, నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. స్వయంభూలో సంయుక్త మీనన్, నభా నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
This TEMPLE was closed as punishment for the entire village.. we went and got it opened last month … these sisters in Chirala were overjoyed… pic.twitter.com/ek7kTfkmk0
— Nikhil Siddhartha (@actor_Nikhil) June 4, 2024
తాజావార్తలు
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!
-
Iran Trolls Trump: ట్రంప్‌ను టీజ్ చేసిన ఇరాన్.. బాలయ్య ‘భగవంత్ కేసరి’ క్లిప్‌తో కౌంటర్
-
Budameru Floods: బుడమేరులో పెరిగిన వరద ఉద్ధృతి.. అప్రమత్తమైన అధికారులు..
-
Nissan Pixo: నిస్సాన్ పిక్సో విడుదల.. 259KM రేంజ్, 10-అంగుళాల డిస్ప్లే, Gemini వాయిస్ అసిస్టెంట్.. ఫీచర్లు ఇవే
-
Anakapalli: వర్షాల వేళ విషాదం.. తల్లీకూతుళ్లను బలిగొన్న విద్యుత్ వైరు
ట్రెండింగ్
-
150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!
-
100W ఫాస్ట్ ఛార్జింగ్, 200MP కెమెరా, 120Hz LTPO డిస్ప్లేతో Xiaomi 18 Pro లాంచ్.!
-
8500mAh బ్యాటరీ, ట్రిపుల్ స్టీరియో స్పీకర్లు, లైకా 200MP ట్రిపుల్ కెమెరాలతో కొత్త ఫ్లాగ్షిప్ Xiaomi 18 Pro Max వచ్చేసిందోచ్..!
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!