Site icon NTV Telugu

Nikhil : ఓటీటీలోకి నిఖిల్ ఎంట్రీ.. యంగ్ హీరో ప్లానింగ్ మాములుగా లేదుగా!

Nikhil

Nikhil

విభిన్నమైన కథాంశాలను ఎంచుకుంటూ టాలీవుడ్‌లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో నిఖిల్ సిద్ధార్థ్. ప్రస్తుతం ఆయన నటిస్తున్న పీరియడ్ యాక్షన్ డ్రామా ‘స్వయంభు’పై అంచనాలు భారీగా ఉన్నాయి. భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో రూపొందుతున్న ‘స్వయంభు’ చిత్రంలో నిఖిల్ ఒక పవర్‌ఫుల్ యోధుడిగా కనిపిస్తున్నారు. ఈ సినిమా టీజర్ ఇప్పటికే సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేయగా, దీనిని రెండు భాగాలుగా (Part 1 & Part 2) విడుదల చేయనున్నట్లు నిఖిల్ స్వయంగా వెల్లడించారు.

Also Read : Virosh wedding : ఎట్టకేలకు ఒక్కటైన ‘విరోష్’.. నా భర్త విజయ్ దేవరకొండ అంటూ రష్మిక ఎమోషనల్ పోస్ట్!

ఈ భారీ చిత్రం 2026, ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో సంయుక్త మీనన్, నభా నటేష్ కథానాయికలుగా నటిస్తున్నారు. అయితే, తాజాగా నిఖిల్ తన అభిమానులకు వరుస సర్ప్రైజ్‌లు ఇచ్చారు. ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేయబోతున్నట్లు ప్రకటించడంతో పాటు, త్వరలోనే డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై కూడా అడుగుపెడుతున్నట్లు వెల్లడించి అందరినీ ఆశ్చర్యపరిచారు.

కానీ ఈ సారి వెండితెరపైనే కాకుండా, ఇప్పుడు ఓటీటీ ప్రపంచంలోకి కూడా నిఖిల్ గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. త్వరలోనే ఒక వెబ్ సిరీస్‌లో నటించబోతున్నట్లు, దీనికి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. దీనితో పాటు నిఖిల్ లైనప్ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. చందూ మొండేటి దర్శకత్వంలో ‘కార్తికేయ 3’, రామ్ వంశీ కృష్ణ దర్శకత్వంలో ‘ది ఇండియా హౌస్’ వంటి పాన్ ఇండియా ప్రాజెక్టులతో ఆయన బిజీగా ఉన్నారు. ఈ చిత్రాలన్నీ నిఖిల్ స్టార్‌డమ్‌ను మరో స్థాయికి తీసుకెళ్లడం ఖాయమని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

Exit mobile version