NTV Telugu Site icon

Paris Olympics 2024: మహిళల 50 కేజీల విభాగంలో ప్రీ-క్వార్టర్‌ఫైనల్స్కు నిఖత్..

Nikat

Nikat

రెండుసార్లు ప్రపంచ ఛాంపియన్ బాక్సర్ నిఖత్ జరీన్.. ఆదివారం పారిస్ ఒలింపిక్స్‌ను ఘనంగా ప్రారంభించింది. మహిళల 50 కేజీల ఒలింపిక్స్‌లో జర్మనీ క్రీడాకారిణి మ్యాక్సీ కరీనా క్లోట్జర్‌పై విజయం సాధించి జరీన్ ప్రిక్వార్టర్‌ఫైనల్‌లోకి ప్రవేశించింది. నార్త్ ప్యారిస్ ఎరీనాలో జరిగిన చివరి 32 రౌండ్‌లో 28 ఏళ్ల అన్‌సీడెడ్ బాక్సర్ జర్మన్ బాక్సర్‌పై 5-0తో గెలిచింది. దీంతో.. రౌండ్ ఆఫ్ 16 లోకి నిఖత్ జరీన్ ప్రవేశించింది.

Read Also: Manu Bhaker: 16 ఏళ్ల వయసులోనే మను భాకర్ కు అంతర్జాతీయ స్థాయిలో స్వర్ణం..

రౌండ్ ఆఫ్ 16లో చైనాకి చెందిన టాప్ సీడెడ్ వుయూతో నిఖత్ జరీన్ తలపడనుంది. ఈ మ్యాచ్లో గెలుస్తే.. నిఖత్ జరీన్ తప్పకుండా ఫైనల్కు వెళ్తుంది. కాబట్టి చైనా బాక్సర్ తో మన తెలుగమ్మాయి ఎలా ఫైట్ చేస్తుంది అనేది చూడాలంటే ఆగస్టు 1 మధ్యాహ్నం 2:30 గంటలవరకు వేచి ఉండాల్సిందే.మాల్దీవ్ ప్లేయర్ ఫాతిమత్‌తో జరిగిన గ్రూప్ ‘M’ మ్యాచ్‌ను సింధు 29 నిమిషాల్లోనే 21-9, 21-6తో ముగించింది. తన తదుపరి మ్యాచ్ ఇస్టోనియా దేశానికి చెందిన క్రిస్టిన్ కూబాతో తలపడనుంది.

Read Also: Nithya Pellikoduku: మహిళల్ని మోసం చేస్తూ 20కి పైగా పెళ్లిళ్లు.. నిత్యపెళ్లికొడుకు అరెస్ట్..

చిన్న వయస్సు నుండి నిఖత్ జరీన్ అసాధారణమైన సామర్థ్యాన్ని ప్రదర్శించింది. అనుభవజ్ఞులైన కోచ్‌ల ఆధ్వర్యంలో తన నైపుణ్యాలను మెరుగుపరుచుకుంది. ఆమె ప్రతిభ.. కృషి ఆమెను వివిధ వెయిట్ కేటగిరీలలో బహుళ జాతీయ టైటిల్స్ గెలుచుకునేలా చేసింది. భారతదేశపు అగ్ర బాక్సర్‌లలో ఒకరిగా ఆమె స్థానాన్ని సుస్థిరం చేసింది. 2019లో రష్యాలోని ఉలాన్-ఉడేలో జరిగిన AIBA మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో 51 కిలోల బరువు విభాగంలో బంగారు పతకాన్ని గెలుచుకోవడం ద్వారా నిఖత్ జరీన్ ఒక ప్రధాన మైలురాయిని సాధించింది. ఈ విజయం ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో బంగారు పతకాన్ని గెలుచుకున్న ఐదవ భారతీయ మహిళగా నిలిచింది.